రావు వేంకట మహీపతి గంగాధర రామారావు I: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
గంగాధర రామారావు వైష్ణవమతాభిమాని. ఆయనకు శ్రీవైష్ణవ పీఠస్థులైన వానమామలై జియ్యంగారు గురుత్వం వహించేవారు. స్మార్తులకు శంకరాచార్య పీఠములెటువంటివో విశిష్టాద్వైతులకు ఈ పీఠమూ అటువంటిది. ఆ పీఠానికి అన్నివిధాలా రామారావు అండగా ఉండేవారు.
== దానధర్మాలు ==
మహా పండితుడైన పాపయ్య శాస్త్రికి మొదట 96 ఎకరాల లంక భూమిని యిచ్చి, ఆపైన వారొక చమత్కారం చేయగా దానిని 148 ఎకరాలు చేసి స్థిరపరిచారు. ఆయన పండితులతో మాట్లాడేప్పుడు ధారాళంగా సంస్కృతంలోనే మాట్లాడేవారు. ఆయనకు దివానులు, ఉన్నతోద్యోగులు, పండితులు, ఆంతరంగికులు మొదలైనవారిపై కోపతాపాలు కలిగితే దానిని వ్యక్తపరిచే తీరు చాలా విచిత్రంగా ఉండేది. తీవ్రమైన కోపానికి కారకులైనవారి జుట్టును పూర్తిగా గొరిగించేవారు.