రావు వేంకట మహీపతి గంగాధర రామారావు I: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంస్థానాధీశులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5:
== దానధర్మాలు ==
మహా పండితుడైన పాపయ్య శాస్త్రికి మొదట 96 ఎకరాల లంక భూమిని యిచ్చి, ఆపైన వారొక చమత్కారం చేయగా దానిని 148 ఎకరాలు చేసి స్థిరపరిచారు. ఆయన పండితులతో మాట్లాడేప్పుడు ధారాళంగా సంస్కృతంలోనే మాట్లాడేవారు. ఆయనకు దివానులు, ఉన్నతోద్యోగులు, పండితులు, ఆంతరంగికులు మొదలైనవారిపై కోపతాపాలు కలిగితే దానిని వ్యక్తపరిచే తీరు చాలా విచిత్రంగా ఉండేది. తీవ్రమైన కోపానికి కారకులైనవారి జుట్టును పూర్తిగా గొరిగించేవారు. ఆనాటి సాంఘిక స్థితిగతుల రీత్యా పూర్తిగా జుత్తు తీసివేసి, బోడిగా తిరగడమంటే గొప్ప అవమానకారకం. ఐతే ఆయన ఇలా అవమానించిన వెంటనే, దీన్ని పూరిస్తూ వారికి బాగా ధనం సకల గౌరవలాంఛనాలతో సహా చెల్లించి మర్యాద చేసేవారు. ఇలాంటి అవమాన సన్మానాలు పొందినవారిలో అప్పటి పండితులైన పొక్కునూరి వెంకటశాస్త్రి వంటి వారు కూడా ఉన్నారు. ఇందులో ధనగౌరవాలు కూడా ఇమిడి వుండడంతో ఆయన ''మహాప్రభో, నా జుట్టు యెంతో అదృష్టం పెట్టిపుట్టింది కనుక మీవంటి మహాప్రభువుల కత్తికి ఎరయ్యింది'' అనేవారు. పైగా ఈ విషయం తెలిసిన అనేకులు సంస్థానాధీశునికి కోపం తెప్పించి అవమానపడి లాభం పొందుదామని ప్రయత్నాలు చేసేవారు. ఇటువంటి నకిలీ ప్రయత్నాలను రామారావు సూక్ష్మబుద్ధితో తెలుసుకుని వాటి వలలో పడక కోపించేవారు కాదు<ref name="కథలు గాథలు చెళ్ళపిళ్ళ">{{cite book|last1=వేంకట శాస్త్రి|first1=చెళ్ళపిళ్ళ|title=కథలు గాథలు 1|date=డిసెంబరు, 2011|publisher=ఎమెస్కో బుక్స్|location=హైదరాబాద్|isbn=978-93-80409-97-9|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%201&author1=chel%27lapil%27la%20ven%27kat%27ashaastri&subject1=GENERALITIES&year=1958%20&language1=telugu&pages=983&barcode=2990100061612&author2=&identifier1=&publisher1=Venkateswara%20Publications,%20East%20Godavari&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-06&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0061/617|accessdate=6 December 2014}}</ref>.
 
[[వర్గం:సంస్థానాధీశులు]]