వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/ఆంధ్ర లొయోల కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
<br />
{{వికీప్రాజెక్టు ఆంధ్ర లొయోల కళాశాల nav/layout}}
[[దస్త్రం:ALCheader.jpgpng|framed|width=80%]]
సీఐఎస్-ఏ౨కే మరియు ఆంధ్ర లొయోల కళాశాల మధ్య జరిగిన సంస్థాగత ఒప్పందం ప్రకారం ఆంధ్ర లొయోల కళాశాల విద్యార్థులు తెవికీ అభివృద్ధికి తోడ్పడనున్నారు.
ఆంధ్ర లొయోల కాలేజీ యాజమాన్యం వారు, బోటనీ శాఖ ద్వారా సీఐఎస్ వారిని కాలేజీకి జూన్ నెలలో ఆహ్వానించడం జరిగింది. ఆ సమయంలో ఎంపిక చేసిన బోధనా సిబ్బందికీ, విద్యార్థులకూ సీఐఎస్ వారు వికీపీడియా, అంతర్జాలంలో విజ్ఞానం మొదలగు పలు విషయాలపై అవగాహన, శిక్షణ కలిపించడం జరిగింది. ఆ కార్యక్రమం యాజమాన్యానికి నచ్చి, ప్రిన్సిపాల్ ద్వారా వికీపీడియా, అంతర్జాల విజ్ఞానం అంశాలపై విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని అందించడం కోసం సీఐఎస్ ను తరచూ కళాశాలకు వచ్చి శిక్షణ ఇవ్వవలసినదిగా కోరడం జరిగింది. అలానే కళాశాలలోని వివిధ కంప్యూటర్ లాబుల్లోని సాఫ్టువేరులను స్వేచ్ఛా సాఫ్టువేరుతో మార్చాలని కోరారు. కళాశాలలోని ఆచార్యులు వ్రాసిన కొన్ని పుస్తకాలను కూడా అంతర్జాలం వేదికగా నలుగురికీ చేరేలా చెయ్యమని అడగటం జరిగింది. కళాశాల స్వయంప్రతిపత్తి గల సంస్థ కావున బోధనాంశాల్లో మారుతున్న సాంకేతికాంశాలను జోడించి, పాఠ్యాంశాల ప్రక్షాళన కోసం కూడా అడగటం జరిగింది. ఈ విషయాలను సీఐఎస్-ఏ౨కే జట్టు తిరిగి అంతరాలోచన జరిపి, ఏఎల్సీ తో కలిసి కొన్ని కార్యక్రమాలను ప్రతిపాదించి, కళాశాల యాజమాన్యం కోరిన విషయాలను వికీపిడియన్ల సహకారంతో, వికీపీడియా-వికీసోర్స్-వికీమీడియా ప్రకరణాలు వేదికగా చెయ్యాలని నిర్ణయించింది. ఇందుకు గానూ సంస్థాగత భాగస్వామ్య ఒప్పందానికి రావాలని నిర్ణయించుకున్నాము. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యానికి తెలియజేసినప్పుడు, వారు కూడా అదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. ఆగస్టు ౧౪న ఒప్పందం పై సంతకాలు జరిగాయి. "పాఠ్యాంశంగా వికీపీడియా" అనే కార్యక్రమం ద్వారా వికీపీడియా సంబంధిత కార్యక్రమాలను కళాశాలలో చేపట్టాలని సీఐఎస్-ఏ౨కే నిర్ణయించింది. ఈ ఒప్పందం చర్చలు లొయోల యాజమాన్యంతో జరుగుతున్న సమయంలో మొత్తం 80 మంది బోధన సిబ్బందిలో నుండి 10 మంది ఈ కార్యక్రమానికి తాము సంధానకర్తలుగా వ్య్వహరిస్తామని ముందుకొచ్చారు. వికీపీడియాను బోధనలో భాగంగా విద్యార్థులకు అందించడంలో వీరు ఆస్సక్తి కనబరచారు. వీరి ఆసక్తి వలన ఈ పది మందినీ ఆంధ్ర లొయోల కళాశాల కోర్ ఫాకల్టీ గ్రూప్ గా వ్యవహరించాలని నిర్ణయించడమయినది. ఈ కోర్ ఫాకల్టీ లోని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు(/రాలు) పది మంది విద్యార్థులను ఎంపిక చేసి, వారి ద్వారా వికీపీడియా సంబంధిత కార్యక్రమాలను కళాశాలలో నిర్వహిస్తారు. ఇలా ఎంపికయిన విద్యార్థులను వికీపీడియా స్టూడెంట్ అంబాసడర్ గా గుర్తించి, వారికి విశేష శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ పది విద్యార్థుల ఎంపిక సంబంధిత ఉపాధ్యాయుడు/రాలు చేయవలసి ఉన్నప్పటికీ, వాళ్ళ నిష్పత్తి మాత్రం, 50% మొదటి సంవత్సరం గ్రాడ్యుయేట్, 20% రెండో సంవత్సరం గ్రాడ్యుయేట్ మిగితా వారు మూడో సంవత్సరం గ్రాడ్యుయేట్ లేదా మొదటి సంవత్సరం పీజీ నుండి ఉండాలి. ఈ విధంగా విద్యార్థులు ఎక్కువ కాలం ఈ కార్యక్రమంతో అనుబంధంగా ఉండవచ్చు. ఈ కోర్ ఫాకల్టీ, వికీపీడియా కాంపస్ అంబాసిడర్స్ కాలిసి వారి సబ్జెక్టులో ఉన్న 500 అవసరమయిన వ్యాసాలను గుర్తించి, ఆంగ్ల తెలుగు వికీపీడియాలలో ఆ వ్యాసాల పరిస్థితిని బేరీజు వేయాలి. ఈ వ్యాసాలు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన బోధనాంశాలలో భాగంగా ఉండాలి.