మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
''ఆంధ్ర రచయితలు'' శాస్త్రి ప్రసిద్ధ రచనలలో ఒకటి. ఇందులో నీతి చంత్రిక, బాల వ్యాకరణం రచించిన [[చిన్నయసూరి]] నుండి [[తుమ్మల సీతారామమూర్తి చౌదరి]] వరకు నూరుగురి మహా రచయితలను గూర్చి సద్విమర్శతో వ్రాయబడిన గ్రంథం. 2012 డిసెంబరులో ఈ గ్రంథాన్ని శాస్త్రి కుమారులు ''మధునామూర్తి'' సవరణలు చేసి నూతనంగా పదముగ్గురు రచయితలను చేర్చి తిరిగి ముద్రించి తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలలోను, మరల హైదరాబాదులోను ఆ గ్రంథాన్ని ఆవిష్కరింపజేశాడు.
 
'''చరిత్ర ధన్యులు''' చరిత్రలో వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన వారి గురించి [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]] రాసిన పుస్తకం.
 
ఇందులో శాస్త్రి [[శాలివాహనుడు]], [[మాధవ వర్మ]], [[గొంకరాజు]], [[అన్నమయ్య]] జీవితాలను చిత్రించాడు. శాలివాహనుడి సాహిత్య కృషిని, మాధవ వర్మ రాజకీయ చతురత, గొంకరాజు ప్రభుభక్తి పరాయణత్వం, అన్నమయ్య ఆధ్యాత్మిక తత్వం ఇందులో ప్రధానంగా పొందుపరచబడ్డాయి.<ref>{{cite book|last1=సత్యనారాయణ|first1=మధునాపంతుల|title=చరిత్ర ధన్యులు|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Charitradhanyulu&author1=Sri%20Madhunapantula%20Sathyanarayana%20Shastry&subject1=-&year=1954%20&language1=telugu&pages=121&barcode=2020120000242&author2=&identifier1=&publisher1=Rwthu%20Book%20Depo&contributor1=CCL&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0000/241}}</ref>
 
చారిత్రక విషయాలకు తగినంతమేర నాటకీయత జోడించి చదువరులను ఆకట్టుకునేలా ఈ పుస్తకం రాయబడింది.
శాస్త్రి రచించి ప్రచురించిన ఖండకావ్యాలు - (1) తోరణములు (2) శ్రీ ఖండములు (3) చైత్రరథం (4) కేళాకుళి అనునవి ఉన్నాయి. శాస్త్రి పిన్ననాటనే అంటే 10 సంవత్సరాల వయస్సులో పద్యాలు వ్రాయడం మొదలుపెట్టారు. 1938లో వారి తొలి ఖండ కావ్యం ‘తోరణము’ వెలువడింది. దానికి [[విశ్వనాథ సత్యనారాయణ]] పీఠిక వ్రాస్తూ శాస్త్రి మహాకవి యయ్యే సూచనలు ఈ పద్యంలో గోచరిస్తున్నాయని ఈ దిగువ పద్యం ఉదాహరించాడు.
<poem>