ధర్మవరం (దుర్గి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
===శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి ఆలయం===
శ్రీ హరిహర బాలనాగేంద్రస్వామి ఆలయాన్ని 24 సంవత్సరాల క్రితం, లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించారు. ప్రతి ఆదివారం ఆలయంలో ప్రత్యేకపూజలకోసం వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహించి, కార్తీకమాసంలో వార్షికోత్సవం చేస్తారు. ఈ వేడుకలలో రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. 2011లో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. రు. 30 లక్షలతో బొడ్రాయి, శ్రీ కోదండరామాలయం, నవగ్రహాలు, అంజనేయస్వామి, పోలేరమ్మ, దుర్గమ్మ ఆలయాలు నిర్మించుకున్నారు. [3] & [5]
 
ఈ ఆలయ వార్షికోత్సవాన్ని, 2014,నవంబరు-9, కార్తీకమాసం, ఆదివారం నాడు, భక్తిశ్రద్ధలతో నిర్వహించినారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు, శనివారం నుండియే ఆలయసన్నిధికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి మూలవిరాట్టుకు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించినారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు, మద్యాహ్నం అన్నదానం నిర్వహించినారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించి, మేళతాళాలతో ఊరేగించినారు. [6]
 
"https://te.wikipedia.org/wiki/ధర్మవరం_(దుర్గి)" నుండి వెలికితీశారు