అనంతవరప్పాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
#ఈ గ్రామములో విద్యాధికులు అధికముగా కలరు. ప్రత్యేకముగా అంతర్జాతీయ రంగమునందు ఎక్కువగా ఉద్యోగులు కలరు.ఈ గ్రామపంచయతీకి 1956 లో జరిగిన ఎన్నికలలో శ్రీ యర్రగుంట్ల సుబ్బారావు (ఆదెయ్య) ఎన్నికైనారు. ఆ సమయంలో గ్రామంలో గ్రంధాలయ భవనం నెలరోజులలో నిర్మించదానికి పంచాయతీ బోర్డు అనుమతి మంజూరు చేసింది. అపుడు, ఏ విధమయిన సాంకేతిక పరిగ్నానం లేని ఆ రోజులలో పగలూ రేయీ కష్టపడి కూలీలతో 25 రోజులలో పనులు పూర్తిచేసి, 29వ రోజుననే శంఖుస్థాపన చేసిన (27-2-1959) ఎం.ఎల్.ఏ శ్రీ తెల్లాకుల జాలయ్య గారిచేతనే 26--3-1959 న ప్రారంభొత్సవం చేయించారు. గ్రామంలో గ్రంధాలయంలో మైకులుఏర్పాటు చేయించి, ప్రతి రోజూ ఉదయం సాయంత్రం వార్తలు చదివి వినిపింపజేశారు. రాష్ట్ర గ్రంధాలయ సంస్ధను సంప్రదించి అవసరమైన పుస్తకాలు తెప్పించారు. గ్రామంలో తొలి అంతర్గత రహదారులు, ప్రధాన మార్గం నిర్మాణంలో విశేష కృషిచేశారు. [3]
#ఈ గ్రామవాసులైన శ్రీ కోయ సాంబశివరావు, 1958 ప్రాంతంలో పొగాకులో అధిక దిగుబడి సాధించిన రైతు. 1958 పంచాయతీ ఎన్నికలలో గ్రామంలో మూడవ వార్డు సభ్యునిగా ఆయనను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన సేవలకు మెచ్చి 1964లో ఉప సర్పంచిగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1970లో గ్రామ సర్పంచిగా ఎన్నికైనారు. 10 సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉన్నారు. వీరు తమ స్వంతనిధులతో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు తరగతి గదులు నిర్మించారు. 1977 నవంబరులో, తుఫాను వలన పేదల గృహాలు కూలిపోవడంతో, ఉచితంగా ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించారు. గ్రామంలోని మూడు ఎస్.సి.కాలనీలలోని మంచినీటి చెరువులలో పూడికతీయించారు. బి.సి., ఎస్.సి.కాలనీలలో ప్రాధమిక పాఠశాలల నిర్మాణం, విద్యుత్తు సౌకర్యం, అనంతవరప్పాడు గ్రామం నుండి గుండారం, గొడవర్రు, నారాకోడూరుకు రహదారులు నిర్మించారు. ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాకపోవడంతో, తన స్వంత నిధులతో పనులు పూర్తి చేయించిప్రజాభిమానం పొందినారు. [7]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ ముప్పా మోహనవంశీ , సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం:- ఈ గ్రామములో కోటి రూపాయల విలువగల ఆస్థులున్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం శిధిలావస్థలో ఉన్నది. గ్రామస్థులంతా కలిసి, 50 లక్షల విరాళాలతో, ఈ ఆలయ జీర్ణోద్ధరణ చేయ సంకల్పించి, 2014,ఫిబ్రవరి-5 న దేవాలయ పునర్నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. [5]
"https://te.wikipedia.org/wiki/అనంతవరప్పాడు" నుండి వెలికితీశారు