స్టూవర్టుపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 98:
===శ్రీ రాగాల వెంకట రాహుల్===
ఈ వెనుకబడిన గ్రామానికి చెందిన, శ్రీ రాగాల మధు, వెయిట్ లిఫ్టింగులో మాజీ క్రీడాకారుడు. ఈయన భార్య శ్రీమతి నీలిమ. ఈ దంపతుల కుమారుడైన వెంకట రాహుల్, తన ఆరు సంవత్సరాల వయసు నుండియే, తన తండ్రి వద్ద వెయిట్ లిఫ్టింగ్ లో శిక్షణ తీసికొంటూ, జిల్లా, రాష్ట్రస్య్థాయి పోటీలలో విజేతగా నిలుచుచూ, హైదరాబాదులోని హకీంపేటలో గల రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలకు ఎంపికైనాడు. అక్కడ కోచ్ ల శిక్షణలో మరింత రాటుదేలి, 2011లో, న్యూజిలాండులోని సమోవా లో జరిగిన కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మూడు బంగారు పతకాలు గెల్చుకొని, తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటినాడు. 2012లో బర్మాలో జరిగిన ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మూడు పసిడి పతకాలు సాధించి మెరిసినాడు. 2013, ఆగష్టు-21న చైనాలోని నాంజింగులో జరిగిన ఆసియా యూత్ వెట్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన రాహుల్, ఏడాది తరువాత అదే నాంజింగ్ వేదికపై యూత్ ఒలింపిక్సులో రజతపతకం సాధించడం విశేషం. గత ఏడాదిన్నర వ్యవధిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన రాహుల్, 18 నెలల కాలంలో 18 పతకాలు సాధించి, అరుదైన రికార్డు సృష్టించి, రాష్ట్రానికీ, దేశానికీ గూడా పేరు తెచ్చి పెట్టినాడు. ప్రస్తుతం పంజాబులోని పాటియాలాలోని "జాతీయ క్రీడా శిక్షణా సంస్థ" లో శిక్షణ పొందుతున్న ఇతడు, కజకస్థానులో 2014, నవంబరు-5 నుండి 11 వరకు నిర్వహించుచున్న ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీలలో 77 కిలోల విభాగంలో పాల్గొనడానికి ఇతడు అర్హత సంపాదించినాడు. ఇతడు 2016లో బ్రెజిల్ లొ జరుగు ఒలింపిక్స్ కూ గూడా ఎంపికైనాడు. [1] , [2] , [4] & [5]
 
ఇతడు ప్రస్తుతం బాపట్లలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో విద్యనభ్యసించుచున్నాడు. ఇతనిని 2014,డిసెంబరు-8వ తేదీనాడు, పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలోని వెయిట్ లిఫ్టింగ్ ఎక్సెలెన్స్ కేంద్రంలో నిర్వహించిన ఎంపిక పోటీలలో 77 కిలోల విభాగంలో. ఆసియా జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనడానికి ఎంపిక చేసినారు. ఈ పోటీలు 2015,జనవరి-3 నుండి 9 వరకు, ఖతార్ దేశంలో నిర్వహించెదరు. []
 
===రాగాల వరుణ్===
"https://te.wikipedia.org/wiki/స్టూవర్టుపురం" నుండి వెలికితీశారు