మేఘ సందేశం (సంస్కృతం): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 49:
* జలదా! అలకాపురిలో ఏడంతస్తుల భవనాలున్నాయి. అందు పైభాగముల నీవంటి నీరదములు గాలికి లోపలికేగి, ఆ భవనములలోని చిత్రాలను తమ జల కణములతో తడిచేసి, ఆ అపరాధం వల్ల భయపడి మెల్లగా పొగలాగా కిటికీలలోంచి నిష్క్రమిస్తాయి . ఇదెలా ఉన్నదంటే - దూతీ సహాయమున రహస్యమార్గంలో అంతఃపురంగలోకి చొరబడి అత్యాచారమొనరించిన ధూర్తుడు ఇతరులకు తెలుస్తుందేమో నని శంకతో, అపరాధ భయంతో, దొంగచాటు దారిలో బయటపడుతున్నట్లు.
 
== ప్రాచుర్యం-ప్రభావాలు ==
== మరిన్ని విశేషాలు ==
* అసలు మేఘ సందేశమే ఒక కల్పన. ఈ కల్పనకు దారి తీసిన పరిస్థితులు నేపథ్యంగా [[విశ్వనాథ సత్యనారాయణ]]ఒక అందమైన కల్పనతో వ్రాసిన నవల [[మేఘదూతము]]. నేపాలరాజవంశాలను పూర్వరంగంగా తీసికొని అతడు వ్రాసిన ఆరు నవల లలో ఇది ఒకటి. కాళిదాసు [[మందాక్రాంతవృత్తము|మందాక్రాంతవృత్తాల]] లో మేఘ సందేశం వ్రాయడానికి గల కారణానికి అతడు చేసిన కల్పన పరమ రమణీయంగా ఉంటుంది.
* మేఘసందేశ కావ్యం లో యక్షుని పేరు ఉదహరింపబడలేదు. అది యాదృచ్ఛికమా? ఉద్దేశపూర్వకమా? కాళిదాసు అంతరంగాన్ని ఈ విషయంలో విశ్లేషించగలమా?
 
* ఎడబాటు కలిగిన ప్రేయసీ ప్రియులు దూతల ద్వారా సందేశములు పంపుట ఇతర [[పురాణములు|పురాణాలలో]] కానవస్తుంది. - నల దమయంతుల హంస రాయబారము, రుక్మిణీ కృష్ణుల బ్రాహ్మణ రాయబారము, [[రామాయణము]]న హనుమంతుని దౌత్యము. [[సుందర కాండము]]లో రామదూతగా [[హనుమంతుడు]] శ్రీరాముని అభిజ్ఞానమును [[సీత]]మ్మకు అందజేసే వృత్తాంతానికి, మేఘదూతంలోని కథానుగమనానికి పోలికలున్నాయి. కాని ఇలా మేఘమును రాయబారిగా ఎంచుకొనే కల్పనలో కాళిదాసే ప్రధముడు. చైనీయ కవి నూకాంగ్ తన కావ్యములో మేఘమును దూతగా పంపెనని బహుభాషా కోవిదుడు, వంగ దేశీయుడు అగు హరనాథ పండితుడు వ్రాసెను. కాని నూకాంగ్ క్రీ.శ. ద్వితీయ శతాబ్దమువాడు. కాళిదాసు క్రీ.పూ. మొదటి శతాబ్దమువాడు. <ref>కోసూరు వెంకట నరసింహ రాజు రచన - 34వ పేజీ</ref>
 
* మేఘ సందేశం కావ్యాన్ని అనుసరిస్తూ అనేక రచనలు వచ్చాయి. ఈ కావ్యంలోని ఊహాగానానికి ఉన్న అందం అలాంటిది. వాటిలో సాంగణ కుమారుడైన విక్రమ కవి రచించిన 'నేమి సందేశము'ను ప్రత్యేకంగా పేర్కొనాలి. మేఘ సందేశంలోని ప్రతి శ్లోకంలోనూ చివరి పాదాన్ని మాత్రం యధా తధంగా తీసుకొని విక్రమ కవి తన కావ్యాన్ని రచించాడు. అంటే పూర్తి కావ్యం సమస్యా పూరణంలా రచించాడన్నమాట. ఇంకా 100కు పైగా అనుసరణ రచనలు వచ్చాయి. 12వ శతాబ్దికి చెందిన ధోయి కవి 'పవనదూతము', 13వ శతాబ్దికి చెందిన వేదాంత దేశిక కవి 'హంస సందేశము', 15వ శతాబ్దికి చెందిన కృష్ణానంద సార్వభౌముని 'పదాంక దూతము', 14వ శతాబ్దికి చెందిన ఉద్దండుని 'కోకిల సందేశము', జైన పండితుడు మేరుతుంగ కవి 'జైన మేఘ దూతము', 17వ శతాబ్దివాడు దేవీ చంద్రుని 'పవన దూతము', 18వ శతాబ్దినాటి వైద్యనాథ సూరి 'తులసీ దూతము' - వాటిలో కొన్ని. 18వ శతాబ్దమున జర్మను కవి శీలరు మేఘదూత కావ్యము ననుసరించుచు వ్రఅసిన 'మారియా స్టూవర్టు' అనే కావ్యంలో నిర్బంధంలో ఉన్న ఒక రాణి మేఘం ద్వారా ఫ్రాన్సు దేశానికి కృతజ్ఞతలు తెలియజేసింది. క్రీ.శ.1083లో నలందా విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడైన ద్వీపాంకర అతీశుడు టిబెట్‌కి వెళ్ళి అక్కడ బౌద్ధాన్ని ఉత్తేజపరిచే క్రమంలో భారతీయ సాహిత్యాన్ని అనువర్తింపజేసేందుకు ప్రోత్సహించారు.
 
== మూలాలు ==