జపాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 357:
జపాన్ సాహిత్యంలో ఆది కాలంలో వెలువడిన రెండు చరిత్ర పుస్తకాలు ''[[:en:Kojiki|కోజికి]]'' మరియు '[[:en:Nihon Shoki|నిహోన్ షోకి]]'' మరియు 8వ శతాబ్దపు కవితారచన ''[[:en:Man'yōshū|మన్ యోషు]]'' అనేవి చైనా భాష లిపిలో వ్రాయబడ్డాయి.<ref>{{cite web |url=http://www.meijigakuin.ac.jp/~ascj/2000/200015.htm |title= Asian Studies Conference, Japan (2000) |publisher=Meiji Gakuin University |accessdate=2007-04-01}}</ref> తరువాత క్రమంగా జపాన్ భాష ప్రత్యేక లిపి అభివృద్ధి చెందింది. [[:en:Murasaki Shikibu|మురసాకీ రచన]]'' అయిన [[:en:The Tale of Genji|గెంజీ కథ]]'' - అనే పుస్తకం ప్రపంచంలో మొట్ట మొదటి [[నవల]] అని చెప్పబడుతుంది.
== మతం ==
క్రీ.శ.5వ శతాబ్దంలో చైనా నాగరికత జపాన్‌కు సోకినా వారి నుంచి మతం మాత్రం ప్రవేశించలేదు. చైనా నుంచి 5వ శతాబ్ది కల్లా కొరియాకు ప్రవేశించిన బౌద్ధమతం కొరియా ద్వారానే జపాన్‌కు చేరింది. క్రీ.శ.580 నాటికి ''ఉమయోదో'' అనే జపాన్ రాజు బౌద్ధాన్ని రాజమతంగా చేశారు. కొరియా భిక్షువులలతో తన ప్రజలకు వైద్యం, జ్యోతిష్యం చెప్పించే ఏర్పాట్లు చేసి దేశస్థులు కొందరు బౌద్ధంలో చేరేలా ప్రోత్సహించారు. బౌద్ధాన్ని గురించి తెలుసుకొమ్మని కొందరు దేశస్థులను రాజు చైనాకు పంపారు. ఆ క్రమంలో కళలు, స్వచ్ఛందసేవ మొదలైనవి కూడా జపాన్‌కు చైనా నుంచి ప్రవేశించాయి. జన్మత: బ్రాహ్మణుడు, భారద్వాజ గోత్రీకుడు అయిన బోధిసేనుడనే బౌద్ధభిక్షువు క్రీ.శ.736లో భారతదేశం నుంచి చిత్రకారులు, గాయకులను తీసుకుని జపాన్ చేరి 30 సంవత్సరాల పాటు బౌద్ధమత ప్రచారం చేశారు. ఆపైన 8వ శతాబ్దంలో సుధాకర సింహ, అమోఘవజ్ర మొదలైనవారు నిర్మించిన మాంత్రికవాదం, అసంగభిక్షుడు సిద్ధాంతీకరించిన ధర్మలక్షణవాదం జపాన్ చేరాయి. అంతేకాక 9వ శతాబ్దంలో జపనీయులే నూతన సిద్ధాంత నిర్మాణాలు చేయడం ప్రారంభించారు. టెండెయ్, షిన్ గన్ అనే బౌద్ధమత శాఖలు ఏర్పడ్డాయి. 12వ శతాబ్దిలో సిద్ధాంతాలు, కర్మావలంబనలు తగ్గి సుఖప్రదమైన జీవితాన్ని సమర్థించే సుఖవటి అనే సిద్ధాంతం ప్రబలింది. బౌద్ధానికి పూర్వం అక్కడ ఉన్న మతంలోని పూర్వదేవతలను బుద్ధుని అవతారాలుగా పరిగణించడమూ ప్రారంభమైంది<ref name="భారతీయ నాగరికతా విస్తరణము">{{cite book|last1=రామారావు|first1=మారేమండ|title=భారతీయ నాగరికతా విస్తరణము|date=1947|publisher=వెంకట్రామా అండ్ కో|location=సికిందరాబాద్, వరంగల్|edition=1|url=www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Bharatiya%20Nagarikatha%20Vistaranamu&author1=Maremanda%20Rama%20Rao&subject1=&year=1947%20&language1=telugu&pages=94&barcode=2020120003970&author2=&identifier1=&publisher1=VENKAT%20RAMA%20AND%20CO&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20KRISHNA%20DEVARAYA%20ANDHRABHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20%20HYD.&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0003/972|accessdate=9 December 2014}}</ref>.
 
== క్రీడా రంగం ==
"https://te.wikipedia.org/wiki/జపాన్" నుండి వెలికితీశారు