మయన్మార్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
క్రీ.పూ 1500 సంవత్సరాల నాటికి ఈ ప్రాంతంలోని ప్రజలు రాగి, ఇత్తడి వాడకం, బియ్యం ఉత్పత్తి అలాగే కోళ్ళు పందుల పెంపకం పెంచడం ఆరంభించారు. వీరు ప్రపంపంచంలోని ప్రధమ మానవులని భావిస్తున్నారు. క్రీ.పూ 500 నాటికి ఇనుప యుగం ఆరంభం అయింది. ప్రస్తుతపు మండలే దక్షిణ ప్రాంతంలో ఇనుప పని ఒప్పందాలు మొదలైనాయి. క్రీ.పూ 500- 200 సమయంలో పెద్ద గ్రామాలు మరియు చిన్న నగరాలలో బియ్యం తయారీ ఒప్పందాలు కూడా చేసుకుని పరిసర ప్రాంతాలలో చైనాతో కూడా చేర్చి వాటిని విక్రయించిన సాక్ష్యాధారాలు కూడా లభ్యం అయ్యాయి.
 
క్రీ.పూ 2వ శతాబ్ధంలో మొదటగా గుర్తింపబడిన నగరాలు బర్మా సేశపు మధ్యభాగంలో మొలకెత్తినట్లు భావిస్తున్నారు. టిబెట్టన్ - బర్మా మాట్లాడే ప్యూ నాగరిక సమూహాలు దక్షిణదిశగా వలస వచ్చిన కారణంగా నగరాలు రూపుదిద్దుకున్నాయని తెలిపే అధారాలు యున్ననన్‌లో ఉన్నాయి. ప్యూ సంస్కృతిక ప్రజలు భారతదేశంతో అధికంగా వ్యాపార సంబంధాలతో ప్రభావితులైయారు. అలాగే బౌద్ధమతాన్ని దిగుమతి చేసుకోవడమే కాక సాంస్కృతిక, వాస్తురూప, రాజకీయ వ్యూహాలతో వారిని ప్రభావితులని చేసాయి. ఆది తరువాత బర్మీయుల సంస్కృతి మరియు రాజకీయ సంస్థల మీద కూడా శాశ్వతమైన ప్రభావం చూపింది. క్రీ.శ.78లో ప్రపంచమంతా చుట్టిన గ్రీకుయాత్రికుడు భారతదేశం నుంచి చైనా వరకూ బర్మా మీదుగా వ్యాపారమార్గం ఉండేదని వ్రాశారు. 3వ శతాబ్దిలో భారతదేశం నుంచి అస్సాం, బర్మాల మీదుగా చైనాకు మార్గం ఉండేదని చంపా అనే శాసనం ద్వారా తెలుస్తోంది. క్రీ.శ.5వ శతాబ్దిలో ఇండోచైనాలో చంపా, కాంబోజ అనే ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు నెలకొన్నాయి. 5వ శతాబ్ది నాటి వ్యు శాసనం నుంచి అంతకు రెండు మూడువందల యేళ్ళకు పూర్వమే హిందూమతం వ్యాపించిందన్న విషయం తెలుస్తోంది. సంస్కృత, ప్రాకృత భాషల్లోని అనేకమైన పదాలు కూడా ఇక్కడి భాషల్లోకి వచ్చి చేరాయి. ఆపైన మహాయాన బౌద్ధం కూడా బర్మాలో ప్రవేశించింది. క్రీ.శ.450లో హీనయానబౌద్ధ బోధకుడైన బుద్ధఘోషుడు ఈ ప్రాంతంలో మతప్రచారం చేశారు<ref name="భారతీయ నాగరికతా విస్తరణము">{{cite book|last1=రామారావు|first1=మారేమండ|title=భారతీయ నాగరికతా విస్తరణము|date=1947|publisher=వెంకట్రామా అండ్ కో|location=సికిందరాబాద్, వరంగల్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Bharatiya%20Nagarikatha%20Vistaranamu&author1=Maremanda%20Rama%20Rao&subject1=&year=1947%20&language1=telugu&pages=94&barcode=2020120003970&author2=&identifier1=&publisher1=VENKAT%20RAMA%20AND%20CO&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20KRISHNA%20DEVARAYA%20ANDHRABHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20%20HYD.&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0003/972|accessdate=9 December 2014}}</ref>. క్రీ. శ 9వ శతాబ్ధానికి పలు నగరాలు ఈ ప్రాంతమంతా మొలకెత్తాయి. మెట్టప్రాంతాలైన బర్మా మధ్య ప్రదేశంలో ప్యూ జాతీయుల నగరాలు సముద్రతీర ప్రాంతంలో మాన్ జాతీయులు మరియు పడమటి తీరప్రాంతాలలో '''ఆర్కనాస్''' జాతీయుల నగరాలు వెలిసాయి. ప్యూ సంప్రదాయ ప్రజలు క్రీ.శ 750-830 నిరంతర నంజయో రాజ్యం నుండి ఎదురైన పలు దండయాత్రల కారణంగా నగరాల విస్తరణ దెబ్బతిన్నది. 9వ శతాబ్ధపు మధ్య నుండి చినరి వరకు నంజయో కి చెందిన '''మార్మా'''(బర్మా/బామర్)వారు పాగన్(బెగాన్) వద్ద ఒక ఒప్పందానికి వచ్చారు.
 
== సామ్రాజ్య వ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/మయన్మార్" నుండి వెలికితీశారు