మలేషియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 187:
మలేషియా విభిన్న సంస్కృతి, విభిన్న సంప్రదాయ మరియు విభిన్న భాషా సమ్మేళిత ప్రజలు కలిగిన దేశం. మలేషియాలో ఒకప్పుడు నివసించిన ప్రస్తుతం తరలించబడిన పురాతన గిరిజన జాతుల సంస్కృతి మూలకేంద్రంగా చెప్పుకోవచ్చు. మలయాలో విదేశీ వ్యాపారులు ప్రవేశించిన తరువాత చైనీయులు మరియు భారతీయ సంస్కృతి ప్రభావం ప్రస్థుత మలేషియాలో గుర్తించతగినంతగా కనిపిస్తుంది. పర్షియన్, అరబిక్ మరియు బ్రిటిష్ వంటి ఇతర సంస్కృతులు కూడా మలేషియా సంస్కృతిలో ఒక భాగమే. ప్రభుత్వ నిర్మాణంలో ఉన్న సాంఘిక సమైక్యత కారణంగా అల్పసంఖ్యాక సంప్రదాయ ప్రజలు అధికసంఖ్యాక సప్రదాయ ప్రజలు సమైక్యత సాధ్యమైంది.
 
మలేషియా సంస్కృతిలో ప్రభావశీలమైన స్థాయిలో భారతీయ సంస్కృతి, మతం, నైతిక, ఆర్థికాది వ్యవహారాల్లో భారతదేశపు ప్రభావం కనిపిస్తోంది. ప్రాచీన హిందువులు పశ్చిమంలో ఆఫ్రికా ఖండపు మొడగాస్కర్ దీవి నుంచి మొదలుకొని తూర్పున మలేషియా మీదుగా జావా, సుమత్రా ద్వీపాల వరకూ వ్యాపారం విస్తరించారు. మతం, నైతికత, ఆర్థికం, జ్యోతిష్యం, గణితం మొదలైన విషయాల్లో వారి సాంకేతిక పదాలు సంస్కృత పదాల్లోనే ఉపయోగిస్తుంటారు.
 
1971లో ప్రభుత్వం మలేషియన్ సంస్కృతి నిర్వచనంతో " జాతీయ సంస్కృతిక విధానం " తయారుచేసింది. ఈ విధానంలో ఈ భూభాగంలో నివసించిన పురాతన స్థానికుల సంస్కృతి ఆధారంగా మలేషియన్ సంస్కృతి ఉండాలని అలాగే ఇతర సంస్కృతాల నుండి తగిన విధానలను కలుపుకోవాలని మరియు ఇస్లాం తప్పక సంస్కృతిలో ప్రధాన పాత్ర వహించాలని స్పష్టమౌతుంది. అలాగే ఈ విధానాలలో మలయా భాష కూడా ఇతరభాషలలో ఒకటిగా ఉండాలని ప్రతిపాదించింది. మలయాపూర్వీకతకు చెందని ప్రజలలో ప్రభుత్వ జ్యోక్యం కొంత అసహనం సృష్టించింది. ప్రభుత్వ జోక్యం తమ సాంస్కృతిక స్వాతంత్ర్యాన్ని తగ్గిస్తుందని భావించారు. భారతీయులు మరియు చైనీయ అసోసేషన్లు ఇది అప్రజాస్వామికమని సూచిస్తూ ప్రభుత్వానికి మెమొరాండం సమర్పించింది.
"https://te.wikipedia.org/wiki/మలేషియా" నుండి వెలికితీశారు