నంది తిమ్మన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు. ఇతని ముక్కు పెద్దదిగా ఉండటంవల్ల, మరియూ ఇతని కవితలలో ముక్కును చక్కగా వర్ణించడంవల్ల!
 
ఇతను [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజాలలో]] ఒకడు. ఇతను రాయల భార్య [[తిరుమల దేవితిరుమలదేవి]] కి అరణంగా [[విజయనగరం]] వచ్చిన కవి. నంది తిమ్మన, ఆరువేల నియోగ బ్రాహ్మణ కుటుంబంలో, నంది సింగన్న, తిమ్మాంబ దంపతులకు జన్మించాడు. ఈయన కౌశిక గోత్ర, అపస్థంభ సూత్రానికి చెందిన వాడినని చెప్పుకున్నాడు. ఈయన అనంతపురం పరిసర ప్రాంతానికి చెందిన వాడని భావిస్తున్నారు. ఈయన నివసించిన రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. ఆ సామంత రాజ్యపు యువరాణి తిరుమలాదేవి ఆ తరువాత కృష్ణదేవరాయల ధర్మపత్ని అయ్యింది.
 
తిమ్మన జన్మతః శైవుడు, అఘోర శివాచార్యుల శిష్యుడైనా, వైష్ణవ రాజాస్థానంలో ఉన్నందువలన, అప్పటి రాజకీయ-సామాజిక పరిస్థితుల వల్ల కొన్ని వైష్ణవ రచనలు కూడా చేశాడు. ఈయన తాత [[నంది మల్లయ్య]] మరియు మేనమామ [[ఘంట సింగన్న]] (ఈయనకే మలయమారుత కవి అనికూడా మరోపేరు) కృష్ణదేవరాయల తండ్రి అయిన [[వీరనరసింహ రాయలు|వీరనరసింహరాయల]] ఆస్థానంలో జంటకవులుగా ఉండేవారు.
"https://te.wikipedia.org/wiki/నంది_తిమ్మన" నుండి వెలికితీశారు