పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 155:
* కాశీప్రయాణం : బాజా భజంత్రీల మధ్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్ళకు పాదుకలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు [[కాశీ]]యాత్రకు పోతున్నానని బయలుదేరుతాడు. వధువు సోదరుడు వచ్చి 'అయ్యా, బ్రహ్మచారిగారూ! మీకాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి', అని చెప్పి బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు. కొన్ని కులాల వారికి ఈ సంప్రదాయం లేదు.
* వరపూజ (ఎదురుకోలు) :కాశీయాత్ర విరమించుకొని వరుడు కళ్యణ మండపానికి వస్తుంటే కన్యాదాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో ఎదురేగి స్వాగతం పలుకుతాడు. పానకం వరునికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. తరువాత కన్యాదాత అందరినీ మండపానికి తీసుకెళతాడు.
* గౌరీవృతం : పెళి ము౦దు చేసే వఁత౦
* మంగళ స్నానాలు :
* కన్యావరణము :బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందుటకై వచ్చే వరునికి ఎదురేగి 'నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్దిల్లమ'ని కన్యాదాత దీవిస్తాడు.
పంక్తి 224:
కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు
వివాహం వల్ల భార్యా భర్తలు కలిసి మెలసి ఒకరికొకరు తోడుగా ఉండాలని సమాజం ఆశిస్తుంది. వివాహం నిలబడటానికి భార్యాభర్తలు ఒకరి నుండి మరికరు వేరు కారాదు. అయితే దంపతులలో ఎవరైనా సరైన కారణం లేకుండా మరికరిని వదిలి దూరమైతే బాధిత్ భర్త లేదా భార్య కోర్టుద్వారా తమ వైవాహిక సంబంధాల పునరుద్ధరణ కోసం దావా దాఖలు చేయవచ్చు. అయితే తప్పుచేసిన వ్యక్తి ఇలాంతి పరిహారం తీసుకోవడానికి వీలులేదు.
 
===హిందూ వివాహం-విడాకులు===
హిందూ వివాహాన్ని నిలబెట్టడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించడమే కాక వైరుధ్య భావాలున్న దంపతులను కలిపి కాపురం చేయించేందుకు గట్టి ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ దురదృష్టవశాత్తు కొన్ని వివాహాలు విఫలమవుతుంటాయి. అందుకు చట్టం కొన్ని కారణాలను పేర్కొని ఆ కారణాలు ఋజువైన సందర్భంలో మాత్రమే విడాకులను మంజూరు చేస్తుంది. వివాహానంతరం దంపతులిద్దరిలో ఎవరైనా వేరొకరితో అక్రమ లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, భార్య లేదా భర్త పట్ల తన క్రూర ప్రవర్తన ద్వారా దైహిక, మానసిక వేదన కలిగిఉండటం, ఒకరు మరొకరిని వరుసగా రెండు సంవత్సరాలపాటు విడిచి పెట్టడం, హిందూ మతం నుండి మరొక మతానికి మారటం, లేదా దంపతులలో ఎవరైనా మానసిక వైకల్యం కలిగి ఉండడి, కలిసి జీవించడం దుర్లభం కావడం వంటి కారణాలతో బాధిత భర్త లేదా భార్య విడాకులను మంజూరు చేయమని కోర్టును ఆశ్రయించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు