కోహినూరు వజ్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
[[గోల్కొండ]] రాజ్యములోని ఓ అసాధారణ వజ్రం కోహినూరు<ref>ఘనమైన మరియు ప్రసిద్ధిగాంచిన వజ్రాలు; http://www.minelinks.com/alluvial/diamonds_1.html </ref>. కోహినూరు వజ్రం తెలుగునాట [[కొల్లూరు గనులు]]లో ఈ ప్రఖ్యాతమైన వజ్రం లభించింది. మాల్వా రాజు [[మహలక్ ‌దేవ్]]‌ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఆయన చేతిలో క్రీ.శ.1300లో ఈ వజ్రం ఉండేదని, క్రీ.శ.1305లో వింధ్యకు నర్మదకు మధ్యభాగాన్ని దాదాపు వేయి సంవత్సరాలు పరిపాలించిన మాల్వా పాలకవంశాన్ని తుదకు అల్లాఉద్దీన్ జయించి అక్కడి ధనరాశులన్నిటితో పాటుగా కోహినూరును కూడా స్వాధీనం చేసుకున్నారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref> చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన [[మాలిక్ కాఫుర్]]తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.<ref>India Before Europe, C.E.B. Asher and C. Talbot, కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రెస్, 2006, ISBN 0-521-80904-5, p. 40 </ref><ref>A History of India, Hermann Kulke and Dietmar Rothermund, Edition: 3, Routledge, 1998, p. 160; ISBN 0-415-15482-0</ref>. ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు. ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది.
 
బాబర్ తన కుమారుడు, సామ్రాజ్యవారసుడూ అయిన హుమాయున్‌కి ఇచ్చారు. హుమాయున్ దానిని అంత్యంత ప్రాణప్రదంగా చూసుకున్నారు. 1530లో రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరాల్లో హుమాయున్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షేర్షా తిరుగుబాటు వల్ల హుమాయున్ రాజ్యాన్ని పరిమితం చేసుకని, ఢిల్లీని వదిలి రాజస్థానంలో కాలం గడిపారు. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు ఆయనకు కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు. తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్దిరోజుల్లో మరణించినా తమవద్దే దాన్ని ఉంచుకున్నారని అక్బరునామా గ్రంథంలో వ్రాశారు.
 
[[బాబర్‌ నామా]]లో మొఘల్‌ చక్రవర్తి [[బాబర్]]‌ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ "ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది' అన్నాడు. తర్వాత మాల్వాను జయించిన [[ఢిల్లీ]] పాలకుడు [[అల్లావుద్దీన్‌ ఖిల్జీ]] దీన్ని సొంతం చేసుకున్నాడు. 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం [[బాబర్]]‌ వశమై 'బాబర్‌ వజ్రం'గా పేరు పొందింది. మొఘల్‌ సామ్రాజ్య పతనావస్థలో దండయాత్రకు వచ్చిన [[నాదిర్ షా]] ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాడు. మొఘల్‌ చక్రవర్తి మహమ్మద్‌ షా ఎల్లవేళలా వజ్రాన్ని తన తలపాగాలో దాచుకుంటాడని కొంతకాలం తర్వాత ఒక మహిళా పరిచారిక ద్వారా తెలుసుకుంటాడు. మహమ్మద్‌ షాను తెలివిగా విందుకు ఆహ్వానించి, తలపాగాలు ఇచ్చి పుచ్చుకుందామన్న ప్రతిపాదన పెడతాడు. అలా గత్యంతరం లేని పరిస్థితులలో మహమ్మద్‌ షా విలువైన ఈ వజ్రాన్ని నాదిర్‌షాకు ధారాదత్తం చేస్తాడు. నాదిర్‌షా దాన్ని చూడగానే కోహ్‌ - ఇ- నూర్‌ (కాంతి శిఖరం) అని అభివర్ణించాడు. దానికి ఆ పేరే స్థిరపడిపోయింది.
"https://te.wikipedia.org/wiki/కోహినూరు_వజ్రం" నుండి వెలికితీశారు