నాదిర్షా భారతదేశ దండయాత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
యుద్ధానంతరం జరిగిన ఘోరమైన నరమేధంలో పర్షియా సేనలు ఢిల్లీలో అన్నివైపుల నుంచి ప్రజలను ముట్టడించి తుపాకులతో కాలుస్తూ, కత్తులతో నరుకుతూ వికృత క్రీడ సలిపాయి. వేలాదిమంది స్త్రీలను అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. పిల్లలను తల్లుల చేతిలో ఉండగానే నరికిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఇళ్ళను తగలబెట్టగా వచ్చిన పొగ మేఘాల్లా ఆకాశాన్ని ఆవరించింది. ఈ ఘోరకాండ చివరకు మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా తన రాజ్యఖజానా తాళాలు చేతికివ్వడంతో ముగిసింది.
== తరలించిన సంపద ==
నాదిర్షా దోచుకుని పోయిన సంపద విలువ ఇంత అని చెప్పేందుకు వీలు లేదు. శతాబ్దాల పరిపాలనలో ప్రజల నుంచి, సామంతరాజ్యాల నుంచి మొఘల్ చక్రవర్తులు పోగుచేసిన సంపదనంతా ఒక్కపెట్టున దోపిడీచేసి తీసుకుపోయాడు. చరిత్రకారులు దీనిని గురించి ఎన్నోరకాలుగా అంచనాలు వేశారు.
* ప్రేజర్ అనే చరిత్రకారుడు ఇది అప్పట్లోనే 70 కోట్ల నవరసులు ఉంటుందని వ్రాశారు. దీనిలోని 25కోట్ల నవరసుల విలువగల సాధారణమైన నగలు ఉన్నాయి. విశేషమైన ఆభరణాల్లో వెండి, బంగారంతో, నవరత్నాలతో నిర్మించిన అపురూపమైన నెమలి సింహాసనం, ప్రపంచ ప్రసిద్ధిచెందిన వజ్రాలైన [[కోహినూర్ వజ్రం]] (క్రమక్రమంగా అది బ్రిటీష్ వారి వద్దకు చేరింది), దర్యా-ఇ-నూర్(ఇది ఇప్పటికీ పర్షియాలోనే ఉంది), ప్రత్యేకంగా నవరత్నాలతో అలంకరించిన వెండి, బంగారు లోహాల ఆయుధాలు, విశిష్టమైన పనితనం, అంత్యంత విలువైన మణిమాణిక్యాలున్న ఆభరణాలు కలిపి 9 కోట్ల నవరసుల ఖరీదని వ్రాశారు.
* నాదిర్షా కొలువులో వజీరుగా చేరిన భారతీయుని కింది ఉద్యోగి ఆనందరాం తనకు తెలిసిన అంచనా తాను వ్రాశారు.