"హుమాయూన్" కూర్పుల మధ్య తేడాలు

హుమాయూన్ చక్కని విద్వాంసుడు. జ్యోతిష్యభూగోళ శాస్త్రములందు అభిరుచి గల యీచక్రవర్తి స్వోపయోగార్ధము భూగోళఖగోలకు ప్రతికృతులను (ఘ్లొబెస్)నిర్మించుకొనెను. జాతకభాగమునందున దీతనికి ప్రబలమగు విశ్వాసముండెడిది. పంచ భూతములయొక్క తత్వమును విమర్చించుచు ఈతడొక గ్రంధమును రచించెను. తన దర్సనమొనర్చి తన ఆదరమునుబడయు జనులను ఈతడు కొన్ని తరగతులుగా విభజించి యందు విద్వాంసులకు మతప్రచారకులతోడను, ధర్మశాస్త్రజ్ఞులతోడను సమముగ అగ్రస్థానమునొసంగెను. ఖగోళమునందు గ్రహముల పేరిట దివ్య భవనములను నిర్మిచి యీచక్రవర్తి శనిగురువుల భవనములలో విద్వత్సమానము నొనర్చుచుండెను. యుద్ధ రంగములకేగునపుడు, తుదకు ప్రాణములకై పరుగెత్తినపుడుగూడ ఈతడు గ్రంధములనుమాత్రము విడువకుండెనట.ఈచక్రవర్తి నిర్మించిన విద్యాలయములలో ఢిల్లీ నగరమందలి కళాశాలయు, ఆగ్రానగరమున కెదురుగ యమునా తీరమందలి మరియొక విద్యాలయమును ముఖ్యమయినవి.
 
హుమాయున్‌కు తన తండ్రి బాబర్ ఎలాంటి స్థితిలోనూ కోల్పోకుండా ఇచ్చిన అపురూపమైన వజ్రం [[కోహినూరు వజ్రము|కోహినూర్‌ని]] చాలాకాలం జాగ్రత్తగా కాపాడుకున్నారు. మొఘల్ చరిత్రకారుడు అబుల్ ఫజల్ వ్రాసిన చరిత్ర ప్రకారం హుమాయున్ షేర్షా కారణంగా రాజ్యాన్ని కోల్పోయి రాజస్థానంలో ప్రవాసం ఉన్నప్పుడు కూడా వజ్రాన్ని నిలబెట్టుకున్నారు. కోహినూర్ పొందాలని మార్వాడ్ రాజైన మాల్దేవు తన అనుచరుడికి వ్యాపారస్తుని వేషం వేసి వజ్రానికి మంచి ధర కట్టి కొనిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే హుమాయున్ అమ్మలేదు. చివరకు రాజ్యాన్ని తిరిగి పొందేందుకు పర్షియన్ రాజు ''షా తహమస్'' సహకరించినప్పుడు, అతనికి కృతజ్ఞతతో 250 విలువైన వజ్రాలతోపాటు కోహినూరును కూడా ఇచ్చేశారు.
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1351481" నుండి వెలికితీశారు