వార్ధా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
జిల్లాలో ఒకప్పటి మౌర్యులు, సుంగాలు, శాతవాహనులు మరియు వకతకాలు, ప్రవర్పూర్, ఆధునిక పవ్నర్ (ఒకప్పటి వకతక సాంరాజ్యానికి రాజధాని) రాజాస్థానాలు పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వతకాలు గుప్తుల సమకాలీనులు. రెండవ చంద్రగుప్తుని (విక్రమాదిద్త్యుడు) కుమార్తె వతక పాలకుడు రుద్రసేనుడిని వివాహం చేసుకుంది.
వతకా పాలకులు క్రీ.శ 2-5 శబ్ధాలకు చెందినవారని భావిస్తున్నారు. వారి సాంరాజ్యం పశ్చిమంలో అరేబియన్ సముద్రం , తూర్పున బంగాళాఖాతం, ఉత్తరాన నర్మదా నది దక్షిణాన గోదావరి కృష్ణా మైదానం వరకు విస్తరించి ఉండేది.
=== చాళుఖ్యులుపాలకులు ===
తరువాత వార్ధాను చాళుఖ్యులు, రాష్ట్రకూటులు, దేవగిరికి చెందిన సెయునా యాదవులు, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు, బేరర్‌కు చెందిన ముస్లిం పాలకులు, గోండులు మరియు మరాఠీలు
పాలించారు. గోండు పాలకుడు రాజా బులంద్ షాహా, బోంస్లే పాలకుడు రఘూజీ మధ్యయుగంలో పాలించిన పాలకులలో ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. [[1850]] నాటికి వార్ధా (అప్పుడు నాగపూర్‌లో భాగంగా ఉండేది) బ్రిటిష్ పాలకుల వశం అయింది. వారు వార్ధాను సెంట్రల్ ప్రోవింస్‌లో విలీనం చేసారు. సేవాగ్రామానికి వార్ధా సహోదర గ్రామంగా ఉండేది. ఇవి రెండు భారతస్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఉండేది. [[1934]] భారతజాతీయ కాంగ్రెస్ సమావేశానికి వార్ధాలోని మాహాత్మాగాంధి ఆశ్రమం కేంద్రంగా ఉంది.
"https://te.wikipedia.org/wiki/వార్ధా_జిల్లా" నుండి వెలికితీశారు