దామెర రాములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
* సి.నా.రె. సాహిత్యపురస్కారం
* చికిత్సారత్న బిరుదు
==రచనల నుండి ఉదాహరణ==
<poem>
'''విరామం ఓటమి కాదు'''
తొక్కి పట్టినం
పాడుతున్న గొంతుని
ఎత్తిపట్టిన పిడికిలిని
బూటుకాళ్లకింద అణగ
దొక్కినం ఇగ
వాడు లేసుడు కల్ల
గొంతునిండా బలం పిండుకుని
పాడటం భ్రమ అని..
ప్రజల చెమటని క్రూర పరిహాసం చేసేవాళ్లు
అధికార ధన మదాంధతతో
అన్నూ మిన్నూ కానని వాళ్లు
పండుగ జేసుకుంటున్నరు
నవ్వులు రువ్వుకుంటున్నరు
కేరింతల్తో మత్తులో
మైమరిచి జోగుతున్నరు
అయినా వాడు లేస్తడు
గొంతు సవరించుకుంటడు
సవరించుకున్న గొంతు సుళ్లు తిరిగి
జడవిచ్చుకునే సమువూదమైతది
చేతివేళ్లు పిడికిలిగా బిగుసుకుంటై
వాడి చేయి శూలాయుధమైతది
వాడు లక్ష్యం విస్మరించడు
వాని పని అయిపోయిందనుకోవద్దు
వాడు మళ్లీ మళ్లీ లేస్తూనే ఉంటాడు
వాడి ఆకాంక్ష ఆవేదన అలజడి ఆందోళన
ఆరాటం దేనికోసమో
చర్చ చేయనంతకాలం
సానుకూల పరిష్కారం రానంతకాలం
వాడు పాడుతూనే ఉంటాడు
వానిపాట నదీ నదాలు
అడవులు పంటపొలాలు
గుట్టలు గుహలూ
భూన భోంతరాళం
మార్మోగుతోంది
నినాద సందేశమై
ఫేసు బుక్కులో
పరివ్యాప్తమౌతోంది
ఆకట్టుకుని ఆలోచింపజేసే
వాడిపాట ఉత్తేజ తరంగాలుగా
పరివర్తన చెంది ప్రసారమై
కర్తవ్యోన్ముఖుల్ని చేస్తోంది
జవసత్వాలు కూడదీసుకున్న
వాడి పిడికిలి ప్రకంపనాలకు
ధృతరాష్ట్ర పీఠాలు కుప్పకూలక తప్పదు
వాడి లక్ష్యం నెరవేరక తప్పదు
వాణ్ణి తొక్కేసినమని ఏమాత్రం
విర్రవీగి విందులు చేసుకోవద్దు
వాడు అజేయ ప్రజాబలసంపన్నుడు
ఉద్యమ వీరుడు
భవిష్యత్తరానికి
స్ఫూర్తి ప్రదాత...
</poem>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/దామెర_రాములు" నుండి వెలికితీశారు