కోవెల సుప్రసన్నాచార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
ఇతడు [[యువ]]నామ సంవత్సర [[ఫాల్గుణ బహుళ నవమి|ఫాల్గుణ కృష్ణ నవమి]] కి సరియైన [[1936]], [[మార్చి 17]] వతేదీన వెంకట నరసింహాచార్యులు, లక్ష్మీనరసమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు.<ref>{{cite book|first1=టి.శ్రీరంగస్వామి|title=కోవెల సుప్రసన్నాచార్యులు- వాజ్మయ జీవిత సూచిక|date=1991|publisher=శ్రీలేఖసాహితి|location=వరంగల్లు|edition=1|url=https://archive.org/stream/kovelasuprasanna020832mbp#page/n1/mode/2up|accessdate=13 December 2014}}</ref>ఇతడి పితామహుడు కోయిల్ కందాడై రంగాచార్యులు, మాతామహుడు ఠంయ్యాల లక్ష్మీనృసింహాచార్యులు ఇతనికి సాహిత్య గురువులు. 9 ఏళ్ల వయసులోనే ఇతడు కందపద్యాలు వ్రాయడం ప్రారంభించాడు. [[వరంగల్లు]]లోని ఎ.వి.వి.హైస్కూలులో ఉన్నతవిద్య చదివాడు.హైదరాబాదులో బి.ఎ.చేశాడు.1959లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ.చేశాడు. రామరాజభూషణుని కృతులు అనే అంశంపై పరిశోధన చేసి 1962లో పి.హెచ్.డి పట్టా పొందాడు. ఎం.ఎ.పూర్తి చేశాక సిటీకాలేజీ, ఈవినింగ్ కాలేజీలలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా చేశాడు. 1961లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడ్‌హాక్ లెక్చరర్‌గా నియమించబడ్డాడు. 1962 నుండి [[కాకతీయ విశ్వవిద్యాలయం]] లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేశాడు. వరంగల్ ఈవినింగ్ కాలేజీకి ప్రిన్స్‌పాల్‌గా, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖకు హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌గా, డీన్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా సేవలను అందించాడు.
==సారస్వత సేవ==
1954లో సాహితీబంధు బృందం అనే సంస్థను స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1957లో మిత్రమండలి స్థాపించాడు. 1958లో హైదరాబాదులో రసధుని అనే సంస్థను మొదలి నాగభూషణశర్మ, మాదిరాజు రంగారావులతో కలిసి ప్రారంభించాడు. 1960లో కులపతి సమితిని స్థాపించాడు. జాతీయ సాహిత్య పరిషత్తులో జీవిత సభ్యుడిగా, విశ్వనాథభారతి సంస్థలో జీవితసభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యుడిగా ఉన్నాడు. పోతన విజ్ఞాన సమితి కార్యదర్శిగా చేశాడు. 1973లో మొదటిసారి అవధానం చేశాడు. తరువాత కరీంనగర్, వేములవాడ, ములుగు, ఘన్‌పూర్, హనుమకొండ తదితర ప్రాంతాలలో సుమారు 60-70 అవధానాలు చేశాడు. గోలకొండపత్రిక, స్రవంతి, తెలుగుదేశం, ప్రభాస, జయంతి, ఆంధ్రప్ర్రభ, ఆంధ్రప్రదేశ్, భారతి, జనధర్మ, జ్యోతి, విమర్శిని, జాగృతి, మూసీ, సాధన మొదలైన పత్రికలలో ఇతని రచనలు ప్రచురింపబడ్డాయి.
 
==రచనలు==