కోవెల సుప్రసన్నాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption =
| birth_name = కోవెల సుప్రసన్నాచార్య
| birth_date = {{birth date |1936|03|17}}/[[1936]] [[మార్చి 17]]
| birth_place = {{flagicon|India}} [[వరంగల్]] పట్టణం, [[తెలంగాణా]] రాష్ట్రం
| native_place = వరంగల్
పంక్తి 14:
| death_cause =
| known =
| occupation = అధ్యాపకుడు
| title =
| salary =
పంక్తి 24:
| religion = హిందూ
| wife =
| spouse= శారద
| partner =
| children =
| father =
| father = వెంకట నరసింహాచార్యులు
| mother = లక్ష్మీనరసమ్మ
| website = http://kovelasuprasanna.blogspot.in/ http://samparayam.blogspot.in/
| footnotes =
| employer =
పంక్తి 36:
}}
'''కోవెల సుప్రసన్నాచార్య''' సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, కవి.
==జీవిత విశేషాలు==
ఇతడు [[యువ]]నామ సంవత్సర [[ఫాల్గుణ బహుళ నవమి|ఫాల్గుణ కృష్ణ నవమి]] కి సరియైన [[1936]], [[మార్చి 17]] వతేదీన వెంకట నరసింహాచార్యులు, లక్ష్మీనరసమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు.<ref>{{cite book|first1=టి.శ్రీరంగస్వామి|title=కోవెల సుప్రసన్నాచార్యులు- వాజ్మయ జీవిత సూచిక|date=1991|publisher=శ్రీలేఖసాహితి|location=వరంగల్లు|edition=1|url=https://archive.org/stream/kovelasuprasanna020832mbp#page/n1/mode/2up|accessdate=13 December 2014}}</ref>ఇతడి పితామహుడు కోయిల్ కందాడై రంగాచార్యులు, మాతామహుడు ఠంయ్యాల లక్ష్మీనృసింహాచార్యులు ఇతనికి సాహిత్య గురువులు. 9 ఏళ్ల వయసులోనే ఇతడు కందపద్యాలు వ్రాయడం ప్రారంభించాడు. [[వరంగల్లు]]లోని ఎ.వి.వి.హైస్కూలులో ఉన్నతవిద్య చదివాడు. హైదరాబాదులో బి.ఎ.చేశాడు. 1959లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఎ.చేశాడు. రామరాజభూషణుని కృతులు అనే అంశంపై పరిశోధన చేసి 1962లో పి.హెచ్.డి పట్టా పొందాడు. ఎం.ఎ.పూర్తి చేశాక సిటీకాలేజీ, ఈవినింగ్ కాలేజీలలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా చేశాడు. 1961లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడ్‌హాక్ లెక్చరర్‌గా నియమించబడ్డాడు. 1962 నుండి [[కాకతీయ విశ్వవిద్యాలయం]] లెక్చరర్‌గా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేశాడు. వరంగల్ ఈవినింగ్ కాలేజీకి ప్రిన్స్‌పాల్‌గా, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖకు హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్‌గా, డీన్‌గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా సేవలను అందించాడు. ఇతని మార్గదర్శకత్వంలో 20 పి.హెచ్.డి, 16 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.
 
==సారస్వత సేవ==
1954లో సాహితీబంధు బృందం అనే సంస్థను స్థాపించి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1957లో మిత్రమండలి స్థాపించాడు. 1958లో హైదరాబాదులో రసధుని అనే సంస్థను మొదలి నాగభూషణశర్మ, మాదిరాజు రంగారావులతో కలిసి ప్రారంభించాడు. 1960లో కులపతి సమితిని స్థాపించాడు. జాతీయ సాహిత్య పరిషత్తులో జీవిత సభ్యుడిగా, విశ్వనాథభారతి సంస్థలో జీవితసభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యుడిగా ఉన్నాడు. పోతన విజ్ఞాన సమితి కార్యదర్శిగా చేశాడు. 1973లో మొదటిసారి అవధానం చేశాడు. తరువాత కరీంనగర్, వేములవాడ, ములుగు, ఘన్‌పూర్, హనుమకొండ తదితర ప్రాంతాలలో సుమారు 60-70 అవధానాలు చేశాడు. గోలకొండపత్రిక, స్రవంతి, తెలుగుదేశం, ప్రభాస, జయంతి, ఆంధ్రప్ర్రభ, ఆంధ్రప్రదేశ్, భారతి, జనధర్మ, జ్యోతి, విమర్శిని, జాగృతి, మూసీ, సాధన మొదలైన పత్రికలలో ఇతని రచనలు ప్రచురింపబడ్డాయి.
 
==రచనలు==
{{Div col|cols=2}}
# భావుకసీమ (సాహిత్య వ్యాససంపుటి)
# భావసంధ్య (వ్యాససంపుటి)
# దీపవృక్షం
# అంతరంగం (పీఠికా సంకలనం)
# చందనశాఖి
# ఏకశిలా సాహిత్య సౌందర్యము (ప్రసంగ వ్యాసాలు)
# కావ్యప్రమితి (వ్యాససంపుటి)
# దర్పణం
# సమర్చన
# సమర్పణ
# మణిసేతువు
# కృష్ణరశ్మి
# ప్రీతి పుష్కరిణి
# సాంపరాయం
# శేఫాలిక
# శ్రీ నృసింహ ప్రపత్తి
# వేదసూక్త సౌరభం
# పాండిచ్చేరి గీతాలు పన్నెండు<ref>{{cite book|last1=కోవెల|first1=సుప్రసన్నాచార్య|title=పాండిచ్చేరి గీతాలు పన్నెండు|date=ఏప్రిల్ 1975|publisher=అరవింద కేంద్రం|location=నర్సంపేట్, వరంగల్ జిల్లా|edition=1|url=http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0029/498&first=1&last=25&barcode=2020120029493}}</ref>
# హృద్గీత ([[కోవెల సంపత్కుమారాచార్య]]తో కలిసి)
# ఆనందలహరి ([[కోవెల సంపత్కుమారాచార్య]]తో కలిసి)
# అపర్ణ ([[కోవెల సంపత్కుమారాచార్య]]తో కలిసి)
# తేజశ్చక్రము
# అధునా
# సాహిత్య వివేచన
# ఋతంభర
# అగ్నిగర్భ (సంపాదకత్వం)
# పాంచాలరాయ శతకం
# సాహృదయ చక్రం
# శతాంకుర
# స్తుతి ప్రబంధము
# కన్నీటికొలను
# శ్రీనిరుక్తి
# వసుచరిత్ర (సంపాదకత్వం)
# చేతనావర్తం-1 (సంపాదకత్వం)
# హిరణ్యగర్భ (సంపాదకత్వం)
# విశ్వనాథ వాజ్మయ సూచిక (సంపాదకత్వం)
# దూపాటి వెంకటరమణాచార్యుల జీవిత చరిత్రము (సంపాదకత్వం)
# వసుచరిత్ర వైభవము (సంపాదకత్వము)
# విశ్వనాథ (సహసంపాదకత్వము)
# అంగద విజయం (నాటకము)
# శుక్తిమతి (రేడియో నాటిక)
# సౌభద్రునియాత్ర (రేడియో నాటిక)
# తెలుగు ఋతువులు (రేడియో నాటిక)
# అన్నదమ్ములు (రేడియో నాటిక)
{{Div end}}
==పురస్కారాలు==
* తెలంగాణ లిటరసీ ఫోరం ఉత్తమ కవితాపురస్కారం (1955)
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు(1971) సాహిత్యవివేచన గ్రంథానికి
* ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (1987)
* ఉత్తమ పరిశోధన పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం (1997)
* జీవీయస్ సాహిత్యపురస్కారం (2001)
* ఆంధ్ర సారస్వత సమితి ఉత్తమ కవితా పురస్కారం (2002) శ్రీ నృసింహప్రపత్తి గ్రంథానికి
* తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ విమర్శా పురస్కారం (2001) అధ్యయనం గ్రంథానికి
* సనాతనధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ శ్రీరామనవమి పురస్కారం (2007)
* ఆచార్య గంగప్ప సాహితీ పురస్కారం (2009)<ref>{{cite news|last1=ఎడిటర్|title=23న కోవెల సుప్రసన్నకు గంగప్ప అవార్డు|url=http://www.prabhanews.com/guntur/article-49611|accessdate=13 December 2014|work=ఆంధ్రప్రభ దినపత్రిక|publisher=ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ లిమిటెడ్|date=19-11-2009}}</ref>
* కేంద్ర సాహిత్య అకాడెమీ ‘టాగూరు సాహిత్య పురస్కారం’ (2010) - అంతరంగం గ్రంథానికి
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హంస పురస్కారం (2013)<ref>{{cite news|last1=ఎడిటర్|title=ఈనాడు ప్రతిభ|url=http://go.eenadupratibha.com/currentinner.aspx?content=Current%20Affairs/Awards/2013/e244fe7d-35b2-4dcd-9680-c560fe1ce906/csw_Content.html|accessdate=13 December 2014|work=ఈనాడు దినపత్రిక|publisher=ఉషోదయా ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాదు}}</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}