"కోవెల సంపత్కుమారాచార్య" కూర్పుల మధ్య తేడాలు

* 1992 - దాశరథి అవార్డు
* 1993 - భాగ్య అవార్డు
===రచనల నుండి ఉదాహరణ===
<poem>
చేరా! ఆత్మీకృత సు
స్మేరా! మైత్రీ విచిత్ర మృదుతాధారా!
వారిత దురహంకార వి
చారా! బంధుర వచో విసారా! చేరా!
 
ఇది చిత్రము, బస్ పయనము
ముదురెండలు, నీదు వ్యాసములబడి ఊహల్
చెదరగ, నీవే మకుటము –
మొదలైనది శతక మొక్క ముచ్చట, చేరా!
 
ఎందాక పద్యముండునొ
అందాకను శతకముండునంటివి కాదా!
ఎందాక కవిత వుండునొ
అందాకను పద్యముండునందును, చేరా!
 
చేరాతలంతగా రా
సీ రాసీ ఏమిలబ్ధి చేకూరెను, మీ
వారూ, మా వారూ సాం
బారులు చిమ్ముటలు తప్ప, మధుమతి, చేరా!
 
రారా, కారా, బూరా
సీరా, బేరా, తిరా, వసీరా, నారా
కోరా, తారా, కేరా –
ఈ రాంతుల తోటి వేగుటెట్లా? చేరా!
 
భావాభ్యుదయమ్ముల శ్రీ
శ్రీ విప్లవ భావలయ రేఖలమీదన్
ధీ వెంచుచు నిజరీతుల
సేవించె విదూషకత్వ సీధువు, చేరా!
 
గిచ్చుట, కయ్యాలాడుట
మచ్చికయై పోయె నీదు మాటలకున్, నీ
దచ్చపు మనసగుటన్ పొర
పొచ్చెము మాకెపుడు రాక పోయెను, చేరా!
 
మన కవుల కేమి లోటగు
జనకవితలటంచు రాసి జనికవులై, చా
రణ కవులుగ తేలిరి, కా
రణ జన్ములుగ చరింతు, రౌరా, చేరా!
 
వ్యాకరణమ్మంటేనే
శోకిస్తారేల బాల శుద్ధాంత కవుల్
భేకం ఘూకం కేకా
బాకా వ్యాకృతులు తెలియబట్టక, చేరా!
 
నిస్త్రీక సభల కెళ్ళకు
ఇస్త్రీ లేనట్టి బట్టలేయకు, నీతో
కుస్తీ పట్టకు నీవే
బస్తీలో నిద్రపోకు – భద్రము, చేరా!
 
బతికేందుకు పోరాటం
కతికేందుకు మెతుకు మెతుకుకై ఆరాటం
ధృతి తప్పిన చెర్లాటం
ప్రతిదీ మనిషికి ఒక పితలాటం, చేరా!
 
టీచింగ్ సెంటర్లణగీ
కోచింగ్ సెంటర్లు పెరిగి కోకొల్లలుగా
దోచేస్తుంటే, చదువును
చాచేస్తుంటే జనమ్మశక్తము చేరా!
 
మత్తులు, గమ్మత్తులు, సం
పత్తులు, నిత్యానుషక్త భావోద్వృత్తుల్
చిత్తులు, బొత్తులు, పల్‌చుర
కత్తులు కందమ్ము లివ్విగదరా, చేరా!
 
అరసం విరసం వీరులు
పరస్పర విభేదముల పక్కకు తోసీ
వెరసి, అహో, పద్య ద్వే
ష రసమ్మును పుక్కిలింత్రు ససిగా, చేరా!
 
హైకూలం చుండంగా
లోకూలంచుండవా? విలోమ కవిత్వ
వ్యాకూతియు తక్కువదటె
నాకున్నీకున్నొకింత నచ్చదె, చేరా!
 
మనసారగ పోతన వే
మనల వలెన్ కాకపోతేమానె, నిజంగా
మనమన కవితలు పరిమిత
జనమైనా చదువునా హుషారుగ, చేరా!
 
ఇస్మాయిల్ స్మైలిస్తే
ఆస్మాన్‌లో పిట్ట వాలునా చెట్టు పయిన్
జాస్మిన్ ఖుష్‌బూలొలికే
అస్మితలే క్రొంబ్రతీక లౌనటె, చేరా!
 
నండూరి యెంకిపాటలు
గుండెలలో గూళ్ళు కట్టి గుసగుసలాడున్
నిండారు బొండుమల్లెలు
పండించిన పరిమళాల వాగులు, చేరా!
 
శ్రీ విశ్వనాథ సాహి
త్యావాసము చేరినంత అది ఇది ఏలా
భావుకతా సీమలు రమ
ణావధులై పులకరింపులయ్యెను, చేరా!
 
మేధావులు, పలువార్గిక
మేధావులు మీడియాల మేధావులతో
సాధారణ జనమంతా
బాధాగ్రస్తమ్ము భ్రాంతి బద్ధము, చేరా!
 
చల్తీకానామ్ గాడీ
కల్తీకానామ్ ఇవాల్టికాలం, దాంతో
జల్తికానామ్ గుండియ
ఢల్తీహై గుండె దిటవిటన్, మరి చేరా!
 
బలవంతపు చదువుల వ
త్తిళులన్ బాల్యంపు సొగసు తీపిని దోచే
మలిన సమాజములో పి
ల్లలకన్ననూ దళితులెవరురా ఇట చేరా!
 
ప్రతివార్షుక హేమంతో
ద్యతనవ సన్మిత్రవలయ హార్దిక భాషా
ప్లుత సంతోష విహారా!
వితత విరాగానురాగ వేల్లిత చేరా!
 
('''చేరాకు శతమానం''' గ్రంథం నుండి)
</poem>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1352488" నుండి వెలికితీశారు