"కోవెల సంపత్కుమారాచార్య" కూర్పుల మధ్య తేడాలు

ఇతడు తన పదమూడవ యేటే సోదరుని కుమారుడు ఇంచుమించు సమవయస్కుడు అయిన [[కోవెల సుప్రసన్నాచార్య]]తో కలిసి జంటగా కవిత్వం చెప్పనారంభించాడు. 1950 ప్రాంతంలో [[విశ్వనాథ సత్యనారాయణ]]తో పరిచయం ఏర్పడింది. అతని సాహిత్య ప్రభావం సంపత్కుమారపై జీవితకాలం పనిచేసింది. ఇతడు వ్యాకరణ, ఛందో గ్రంథాలను, విమర్శను, ఖండకావ్యాలను, సాహిత్య చరిత్రను, శతకాలను, ప్రాచీన గ్రంథాల పరిష్కరణలను, విపులమైన పీఠికలను,నాటికలను ఎన్నో వ్రాశాడు. 'మరుగునపడిన మన పండితులు' పేరిట జనధర్మలో ధారావాహికంగా 52 వారాలు వ్రాశాడు.
===రచనలు===
{{Div col|cols=2}}
# హృద్గీత ([[కోవెల సుప్రసన్నాచార్య]]తో కలిసి)
# ఆనందలహరి ([[కోవెల సుప్రసన్నాచార్య]]తో కలిసి)
# ఏకశిలా సాహిత్య సౌందర్యము (సంపాదకత్వం)
# పోతన భాగవత నీరాజనం (సహసంపాదకత్వం)
# మన కవులు,పండితులు,రచయితలు
{{Div end}}
 
===పురస్కారాలు===
* 1992 - దాశరథి అవార్డు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1352489" నుండి వెలికితీశారు