తైత్తిరీయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
==విభాగాలు==
తైత్తిరీయ బ్రాహ్మణం మూడు '''కాండలు''' గా విభజింపబడినది. దీనిలో మొదటికాండకు '''పారక్షుద్రము''' అని, రెండోకాండమునకు '''ఆగ్నిహోత్రము''' అని పేర్లు. మూడవ కాండము లోని విభాగాలకు విడివిడిగానే వాటివాటికి పేర్లు ఉన్నాయి. మొదటి, రెండవ కాండములలో ఒక్కొక్క దానిలో ఎనిమిది చొప్పున ప్రపాఠకాలు ఉన్నాయి. మూడవ కాండములో మాత్రము పన్నెండు ప్రపాఠకాలు ఉన్నాయి. ప్రతి ప్రపాఠకం లోను కొన్ని అనువాకములు ఉంటాయి. మొదటి కాండములో రెండవ ప్రపాఠకంలో అతి తక్కువ సంఖ్యలో ఆరు అనువాకములు ఉన్నాయి. అదేవిధముగా, మూడవ కాండములో ఎనిమిదవ మరియు తొమ్మిదవ ప్రపాఠకాలలో అతి ఎక్కువ సంఖ్యలో ఒక్కొక్క దానిలో ఇరవైమూడు చొప్పున అనువాకములు ఉన్నాయి. మొత్తం ఇందులో 338 అనువాకాలు ఉన్నాయి.
===విషయవిభాగం===
మొదటికాండలోని ఎనిమిది ప్రపాఠకాలలో గవామయనశేషవిధి, వాజపేయంవిధి, సోమాది విధి, లగ్న్యాధానవిధి, రాజసూయం, నక్షత్ర్రేష్టకామంత్రాలు మొదలయినవి నిరూపించబడ్డాయి.
రెండోకాండలోని ఎనిమిది ప్రపాఠకాలలో ఉపహోమాలు, కామ్యపశుయాగాలు, అగ్నిహోత్రవిధి, సౌత్రామణి, ఒకేరోజున చేయవలసిన '''నవం''' అనే పేరుగల యాగాలు ప్రతిపాదించబడ్డాయి..
మూడోకాండలో దర్శపూర్ణమాసవిధి, మనుష్యపశువిధి, అశ్వమేధం, నక్షత్రేష్టి, అశ్వమేధం, సావిత్రచయనం, నాచికేతాగ్నిచయనం, చాతుర్హోత్రచయనం, వైశ్వసృజాగ్నిచయనం ప్రస్తావించబడ్డాయి.
===కాఠకము===
తైత్తిరీయ బ్రాహ్మణంలోని మూడు కాండములను అష్టకాలు అని, ప్రపాఠకాలని అధ్యాయాలు అని కూడా అంటారు. మూడవ కాండములోని చవరి మూడు ప్రపాఠకాలని (10,11 మరియు 12) '''కాఠకము''' అని పేరు. ఈ భాగము ఒకనాడు కఠశాఖకు సంబందించినది. అందువలన దీనికి ఆపేరు వచ్చింది.
Line 42 ⟶ 46:
|మొత్తం|| || 78 + || మొత్తం || || 96 + || మొత్తం || ||164=338
|}
 
==ప్రాముఖ్యత ==
* ఈ సంహితలోని కొన్ని వ్యక్తిగత శ్లోకాలు హిందూమతంలో ప్రత్యేక ప్రాముఖ్యత పొందాయి. ఉదాహరణకు తైత్తిరీయ సంహిత - (తై.సం.): 4.5 మరియు తైత్తిరీయ సంహిత - (తై.సం.): 4.7 శ్రీ రుద్రం చమకం ఉన్నాయి. అయితే 1.8.6.i శైవెతే త్రయంబకం మంత్రం కూడా ఉంది.