తైత్తిరీయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
రెండోకాండలోని ఎనిమిది ప్రపాఠకాలలో ఉపహోమాలు, కామ్యపశుయాగాలు, అగ్నిహోత్రవిధి, సౌత్రామణి, ఒకేరోజున చేయవలసిన '''నవం''' అనే పేరుగల యాగాలు ప్రతిపాదించబడ్డాయి..
మూడోకాండలో దర్శపూర్ణమాసవిధి, మనుష్యపశువిధి, అశ్వమేధం, నక్షత్రేష్టి, అశ్వమేధం, సావిత్రచయనం, నాచికేతాగ్నిచయనం, చాతుర్హోత్రచయనం, వైశ్వసృజాగ్నిచయనం ప్రస్తావించబడ్డాయి.
===మొదలు-చివర===
ఈ తైత్తిరీయ '''బ్రాహ్మణం బ్రహ్మ సంధత్తం తన్మే జింవతమ్''' అనే మంత్రంతో ప్రారంభమవుతుంది. చివరన '''విశ్వమేనా నను ప్రజాయతే''' అను మంత్రంతో పరిసమాప్తము అవుతుంది.
 
===కాఠకము===
తైత్తిరీయ బ్రాహ్మణంలోని మూడు కాండములను అష్టకాలు అని, ప్రపాఠకాలని అధ్యాయాలు అని కూడా అంటారు. మూడవ కాండములోని చవరి మూడు ప్రపాఠకాలని (10,11 మరియు 12) '''కాఠకము''' అని పేరు. ఈ భాగము ఒకనాడు కఠశాఖకు సంబందించినది. అందువలన దీనికి ఆపేరు వచ్చింది.