రామదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
=='''అంతర్యుధ్ధం'''==
=== నేపథ్యం ===
వేంకటపతి దేవరాయలకు నలుగురైదుగురు భార్యలున్నా వారిలో ఎవరికీ పుత్రసంతానం కలగకపోవడంతో వెంకటాంబ అనే భార్య ఒక బ్రాహ్మణ స్త్రీ కుమారుణ్ణి తనకు, దేవరాయలకు పుట్టిన కుమారునిగా చూపజూశారు. విషయం తెలుసుకున్న వేంకటపతి దేవరాయలు ఆ పిల్లవాణ్ణి తన కుమారుని వలెనే పెరగనిచ్చి, బావమరిది కుమార్తెనిచ్చి పెళ్ళిచేసినా చివరకు రాజ్యాన్ని మాత్రం అన్నగారి కుమారుడైన శ్రీరంగరాయలకు ఇచ్చారు. వేంకటపతి దేవరాయల మరణానంతరం శ్రీరంగరాయలు రాజ్యానికి వచ్చిన కొద్దిరోజుల్లోనే వేంకటపతిదేవరాయల బావమరిదియైన జగ్గరాజు శ్రీరంగరాయలను సకుటుంబంగా ఖైదుచేశారు. శ్రీరంగరాయలు సకుటుంబంగా ఖైదులో ఉండగానే యాచమనాయుడు అనే సేనాని జగ్గరాయని కుట్రకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తూ రామదేవరాయలను ఖైదు నుంచి తప్పించారు. ఆపైన శ్రీరంగరాయల కుటుంబాన్ని కూడా తప్పించబోగా జగ్గరాజు మొత్తంగా కుటుంబాన్ని అంతా నరికివేశారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref> జగ్గారాయుడు వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడిని సింహాసనంపై అధిష్టింపచేశారు.
 
=== యుద్ధం ===
అసలు వారసుడైన రామ దేవుడి తరఫున యాచమ నాయుడు ఆ ప్రయత్నాల్ని అడ్డుకున్నాడు. అనంతరం జరిగిన అంతర్యుధ్ధంలో యాచమ నాయుడు జగ్గారాయుడిని ఓడించాడు.
"https://te.wikipedia.org/wiki/రామదేవ_రాయలు" నుండి వెలికితీశారు