సదాశివ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
 
ఇతను కేవలం నామమాత్ర పరిపాలకుడు మాత్రమే, అధికారము మొత్తం [[పెదతిరుమలయ్యదేవమహారాయలు]] చేతిలో ఉండెడిది. కానీ తరువాత [[అళియ రామ రాయలు]] కూడా అధికారం కోసం పోటీ పడినాడు. ఈ కాలమున విజయనగరం అంతఃకలహములకు తీవ్రంగా లోనయ్యింది, పరిస్తితులు ఎంతవరకూ వచ్చినాయంటే, [[పెద తిరుమలయ్యదేవమహారాయలు]] రాజధానిలోనికి ఆదిల్షాను సైన్యసమేతంగా ఆహ్వానించినాడు. అంతకు ముందే పెద తిరుమలయ్య దేవమహారాయలు తన మేనళ్ళుడూమేనల్లుడూ, రాజ్యానికి వారసుడూ, [[అచ్యుత రాయలు]] కుమారుడు అయిన చిన వేంకటపతి రాయలును హత్యాగావించి తనే సింహాసనం అధిస్టించినాడు!
 
ఈ సుల్తాను రాజధానిలోనికి రావడంలో సిగ్గుపడి, బయపది, అవమానపడిన [[అళియ రామ రాయలు]] పెద తిరుమలయ్యను ఒప్పించి సుల్తానుకు ధనం అప్పగించి ఇంటికి పంపించినాడు.
పంక్తి 9:
తరువాత [[అచ్యుత దేవ రాయలు]] సోదరుని కుమారుడగు '''సదా శివ రాయలు''' సింహాసనం అధిష్టించినాడు, కానీ అధికారం మాత్రం [[అళియ రామ రాయలు]] చేతిలోనే ఉండేది. అనంతర కాలంలో సుల్తానుల కూటమితో విజయనగర సామ్రాజ్యం రాక్షస తంగడి యుద్ధంలో ఘోర పరాజయం పాలై అళియ రామరాయలు యుద్ధంలో మరణించారు. ఈ యుద్ధానంతరం సుల్తానుల సైన్యం మొత్తంగా రాజధానియైన విజయనగరం మూలమట్టంగా నాశనం చేసింది. దీనితో అళియ రామరాయల తమ్ముడైన తిరుమల దేవరాయలు సదాశివరాయలను, విజయనగర సామ్రాజ్య ఖజానాను తీసుకుని పెనుకొండకు పారిపోయారు.
 
పెనుకొండలో కూడా ఇతనిని సింహాసనంపై ఉంచి తిరుమల దేవరాయలే పరిపాలించారు. చివరకు 1570లో సదాశివ రాయలను తిరుమల దేవరాయలు సంహరించి తాను అధికారం చేపట్టారని రాబర్ట్ న్యూయల్ భావించారు. కానీ సదాశివ రాయల శాసనాలు 1575 వరకూ కనిపిస్తూండడంతో ఇది వాస్తవం కాదని చరిత్రాకారులు అభిప్రాయపడుతున్నారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref>
 
{{విజయ నగర రాజులు}}
"https://te.wikipedia.org/wiki/సదాశివ_రాయలు" నుండి వెలికితీశారు