రేఖాచిత్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎రూపం మరియు సమతౌల్యం: రెండు ప్యారాలు
పంక్తి 79:
 
==రూపం మరియు సమతౌల్యం==
వాస్తవానికివాస్తవిక కూర్పికికూర్పుకి సబ్జెక్టు యొక్క పరిమాణాలని కొలవటం చిత్రీకరణ లో చాలా ప్రాముఖ్యత కలది. వృత్తలేఖిని, స్కేలు, సెట్-స్క్వేర్ వంటివి ఉపయోగించి కోణాలు, దూరాలు చిత్రంలో కూరుస్తారు.
 
మానవ శరీరం వంటి క్లిష్టమైన ఆకృతులని చిత్రీకరించవలసి వచ్చినపుడు మొదట ప్రాథమిక ఆకారాలని చిత్రీకరించటం బాగా ఉపయోగగపడుతుంది. ఏ ఆకారమైననూ క్యూబ్, స్ఫియర్ (గోళం), సిలిండర్ మరియు కోన్ ఆకారాలతో లేదా వీటి కలయికలతోనో ప్రతిబింబించవచ్చును. వీటన్నిటినీ సరైన విధానంలో అమర్చినట్లు చిత్రీకరించి, ఆ పై వాటికి మరిన్ని మెరుగులు దిద్ది వాటిని చక్కని చిత్రపటాలుగా మలచవచ్చును. అంతర్లీన నిర్మాణాన్ని యథాతథంగా చిత్రీకరించగలగటం చక్కని చిత్రపటం యొక్క ప్రాథమిక లక్షణం కావటం మూలాన, దీని సద్వినియోగం సూక్ష్మ వివరాలలో పలు అనిశ్చితులని తొలగించి స్థిరమైన చిత్రాలకి తుది రూపాన్ని ఇవ్వటంలో దోహదపడటం వలన, ఈ విద్య పలు పుస్తకాలలో, విద్యాలయాలలో విరివిగా నేర్పించబడుతుంది.
 
అనాటమీ (మానవ శరీర నిర్మాణ శాస్త్రం) పై పట్టు చక్కని పోర్ట్రెయిట్లని చిత్రీకరించటానికి ఉపయోగపడుతుంది. సుశిక్షితుడైన ఒక కళాకారుడు అస్థిపంజర నిర్మాణం, కీళ్ళు, కండరాలు, స్నాయిబంధనములు, శరీర కదలికలలో వీటన్నిటి అరమరికల పై మంచి పట్టు కలిగి ఉంటాడు. వివిధ భంగిమలలో సహజత్త్వాన్ని ఉట్టిపడేలా చేయటానికి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ఆకృతులు ఎలా మారతాయి అన్న అంశంపై కూడా కళాకారుడికి అవగాహన ఉండాలి.
 
==కోణం==
"https://te.wikipedia.org/wiki/రేఖాచిత్రం" నుండి వెలికితీశారు