చక్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
'''చక్రి''' అలియాస్ '''చక్రధర్ జిల్లా ''' ఒక తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. ఇతడు [[జూన్ 15]], [[1974]]న [[వరంగల్]] జిల్లా [[మహబూబాబాద్]] మండలం [[కంబాలపల్లి]] లో జన్మించారు. ఇతను సంగీతం సమకూర్చిన సినిమాల్లో చెప్పుకోదగినవి [[ఇడియట్]], [[అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి]], [[సత్యం]]. తెలుగులోనే కాక తమిళం, కన్నడంలో కూడా చక్రి సంగీతం సమకూర్చాడు. చక్రధర్ జిల్లా సంగీతం అందించిన చివ‌రి చిత్రం [[ఎర్ర‌బస్సు]].
==నేపధ్యము==
స్వయంకృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి సంగీత దర్శకుడు చక్రి జీవితం ఒక ఉదాహరణ. చక్రి అసలు పేరు చక్రధర్ జిల్లా. వరంగల్ జిల్లా మహబూబాబాద్ సమీపంలోని కంబాలపల్లి చక్రి స్వస్థలం. ఉపాధ్యాయుడైన చక్రి తండ్రి వెంకటనారాయణ కళాకారుడు కూడా. బుర్రకథలు స్వయంగా రాసుకొని ప్రదర్శించేవారు. చక్రి తల్లి విద్యావతి గాయని. చక్రికి సంగీత జ్ఞానం అబ్బడానికి కారణం తల్లిదండ్రులే. చిన్నప్పట్నుంచీ చక్రి బాగా పాడేవారు. కొడుకు మనోభీష్టాన్ని గౌరవించి తల్లిదండ్రులు కూడా బాగా ప్రోత్సహించారు.కంబాలపల్లిలో పదవ తరగతి వరకూ చదువుకున్న చక్రి... అక్కడే ఫ్లూట్ నేర్చుకున్నారు.
ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకూ మహబూబాబాద్‌లో చదువుతూ.. అక్కడే వయోలిన్, కర్ణాటక సంగీతం అభ్యసించారు.అప్పట్లో మహబూబాబాద్ చుట్టుపక్కల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా... చక్రి సంగీత విభావరి ఉండాల్సిందే. చక్రి ట్రూప్ పేరు ‘సాహితీ కళాభారతి’. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు... కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘ఒకే జాతి మనదిరా... ఒకే బాట మనదిరా’ అనే పాటను చక్రి స్వయంగా రాసి, స్వరపరిచి ఆలపిస్తే... కాలేజ్ ఆడిటోరియమంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. చక్రి ప్రతిభను గమనించిన స్నేహితులందరూ... ‘నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. నీ పాట ఊళ్లల్లో జరిగే శుభకార్యాలకు పరిమితం కాకూడదు. తెలుగు సినీ సంగీతాన్ని శాసించే సత్తా నీలో ఉంది. నువ్వు హైదరాబాద్ వెళ్లు’ అంటూ బతిమాలారట. కానీ... చక్రి మాత్రం పెడచెవిన పెట్టాడు.
 
చక్రిని టీచర్‌గా చూడాలనేది తండ్రి ఆకాంక్ష. కానీ... చక్రికి మాత్రం ఉద్యోగాలపై ఆసక్తి ఉండేది కాదు. '''ఒకరి ముందు చేతులు కట్టుకొని నిలబడలేను ''' అంటూ నిర్మొహమాటంగా చెప్పేసేవారు. 'ఏదైనా వ్యాపారం పెడితే.. తానే పదిమందికి పని ఇవ్వొచ్చు కదా!' అనుకొని... ఓ రెడీమెడ్ బట్టల దుకాణం పెట్టడానికి సమాయత్తమయ్యారు. అయితే... చక్రి బట్టల దుకాణం పెట్టడం ఫ్రెండ్స్‌కి ఇష్టం లేదు. వాళ్లు మాత్రం చెవిలో జోరీగల్లా హైదరాబాద్ వెళ్లమని మొత్తుకుంటూనే ఉన్నారు. చివరకు హైదరాబాద్ బస్సెక్కారు చక్రి.
 
===సంగీత దర్శకుడి గా తొలి అవకాశం===
పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన [[బాచి]] చక్రి సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఆ తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు చక్రి దర్శకత్వం వహించాడు. అంత‌కు ముందే పిల్లలు కాదు పిడుగులు చిత్రంలో ఒక పాటకు సంగీతం అందించారు. దేనికైనా రెడీ చిత్రంలోనూ 3 పాటలకు చ‌క్రి సంగీతం అందించారు.
Line 32 ⟶ 38:
ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి. సత్యం, శివమణి, దేశముదురు, గోపి గోపిక గోదారి, నేనింతే, మస్కా, సరదాగా కాసేపు, చక్రం, ఆంధ్రావాలా, ఇట్లు శ్రావణి , భగీరథ, ఢీ, రంగ ది దొంగ చిత్రాలకు చక్రి సంగీత దర్శకత్వం వహించారు. చిన్న వయస్సులోనే చక్రి పలు హిట్‌సాంగ్స్ అందించారు. కొత్త గాయనీ, గాయకులు ఎంతో మందిని చక్రి టాలివుడ్‌కు పరిచయం చేశారు. శ్రీమన్నారాయణ, జై బోలో తెలంగాణ సినిమాలకు చక్రి సంగీతం అందించారు.
ప్రవీన్
 
==చక్రి సంగీత దర్శకత్వంలో అమిత ప్రజాదరణ పొందిన కొన్ని పాటలు==
==చక్రి సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/చక్రి" నుండి వెలికితీశారు