చక్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
== మరణం ==
డిసెంబ‌ర్14 రాత్రి చక్రికి గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఐసీయూలో [[2014]], [[డిసెంబర్ 15]] న తుదిశ్వాస విడిచారు.
===చక్రి మరణంపై సినీరంగ ప్రముఖుల సంతాపం===
 
*చక్రి నా బిడ్డ లాంటివాడు. నాకు చాలా నచ్చిన వ్యక్తి. భవిష్యత్తులో అతనితో చాలా సినిమాలు చేయాలనుకున్నాను. ఇంత చిన్న వయసులో ఆయన మరణం నన్నెంతో కలచివేసింది. దాసరి నారాయణరావు, దర్శక - నిర్మాత
*చక్రి సంగీతానికి అభిమానిని నేను. మనిషిలాగే అతని మనసు కూడా భారీ. నా తమ్ముడు లాంటి చక్రి ఇలా హఠాన్మరణం చెందడం బాధగా ఉంది. తెలంగాణ ముద్దు బిడ్డ అయిన చక్రి మరణం కళాకారులకూ, కళాభిమానులకూ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. నందమూరి బాలకృష్ణ, సినీ హీరో
*తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు చక్రి. స్వయంకృషితో ఎదిగిన ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం. నేడు నిజంగా దుర్దినం. ఈ బాధను తట్టుకునే శక్తిని చక్రి కుటుంబానికి ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. డి.సురేశ్‌బాబు, నిర్మాత
*స్నేహానికి విలువిచ్చే గొప్ప వ్యక్తి చక్రి. వాణిజ్య చిత్రాలతో పాటు, విప్లవ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారాయన. చక్రి మరణం యావత్ సినీ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆర్.నారాయణమూర్తి, నట - దర్శకుడు
*గత రాత్రి ఆఫీసు నుంచి తను ఇంటికెళ్లే ముందు ‘ఎందుకో జగన్ అన్నయ్యను చూడాలని ఉందిరా’ అని ఆఫీస్‌బాయ్‌తో అన్నాడట చక్రి. అది తెలిసి నా మనసు భారమైంది. నా తమ్ముణ్ణి కోల్పోయాను. నిజంగా చాలా బాధగా ఉంది. నా సినిమాతోనే తన కెరీర్ మొదలైంది. నా ప్రతి సినిమాకూ అద్భుతమైన సంగీతం అందించాడు చక్రి. పూరి జగన్నాథ్, దర్శక - నిర్మాత
*చక్రి స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి. ఆయన ప్రతిభను తెలుగు చిత్రసీమ సరిగ్గా వినియోగించుకోలేదనే అనాలి. స్నేహానికి ప్రాణమిచ్చే అలాంటి మంచి మనిషి మరణం తెలంగాణ సినిమాకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకూ తీరని లోటు. ఎన్.శంకర్, ‘జై బోలో తెలంగాణ’ దర్శకుడు
*చెడ్డవాళ్లు కూడా చనిపోయాక మంచి వాళ్లయిపోతారు. కానీ, బతికుండగానే చాలా మంచివాడిగా పేరు తెచ్చుకున్న మా చక్రి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వైవీఎస్ చౌదరి, దర్శక - నిర్మాత
*జగమంత కుటుంబాన్ని సంపాదించుకొని ఏకాకిలా వెళ్లిపోయాడు చక్రి. తను దూరమైనా తన పాట మాత్రం ఎప్పుడూ బతికే ఉంటుంది. సుద్దాల అశోక్‌తేజ, సినీ గీత రచయిత
{{నంది పురస్కారాలు}}
 
"https://te.wikipedia.org/wiki/చక్రి" నుండి వెలికితీశారు