"ఏనుగుల వీరాస్వామయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
[[ఫైలు:Enugula Veeraswamayya 1.jpg|right|thumb|200px]]
[[ఫైలు:Enugula Veeraswamayya 2.jpg|right|thumb|200px]]
'''ఏనుగుల వీరాస్వామయ్య''' ([[1780]] - [[1836]]) తెలుగు రచయిత, యాత్రికుడు. ఇతడు [[కాశీయాత్ర చరిత్ర]] విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధుడు. [[కాశీయాత్ర చరిత్ర]] మొదటిసారి అచ్చు అయినపుడు కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన ముందుమాట వలన, తన రచనలో సందర్భానుసారంగా వీరాస్వామయ్య పేర్కొన్న విషయాల వలన, దిగవల్లి వేంకటశివరావు, ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంలో వెలువడిన కాశీయాత్ర చరిత్ర గ్రంథాలలోని పీఠికల ద్వారా వీరాస్వామయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.
 
 
[[కాశీయాత్ర చరిత్ర]] మొదటిసారి అచ్చు అయినపుడు కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన ముందుమాట వలన, తన రచనలో సందర్భానుసారంగా వీరాస్వామయ్య పేర్కొన్న విషయాల వలన, దిగవల్లి వేంకటశివరావు, ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంలో వెలువడిన కాశీయాత్ర చరిత్ర గ్రంథాలలోని పీఠికల ద్వారా వీరాస్వామయ్య జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.
 
==బాల్యం==
ఏనుగుల వీరాస్వామయ్య తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీవత్స గోత్రంలో 1780 ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు సామయమంత్రి. 9వ యేటనే వీరాస్వామయ్య తండ్రి గతించాడు. వారి కుటుంబం కొన్ని తరాలుగా మద్రాసులో ఉండేది.
 
 
==ఉద్యోగం==
 
ఉన్నత ఉద్యోగంలో తనకున్న విశేష స్థాయిని అతను ఎప్పుడూ చెప్పుకోలేదు. సందర్భానుసారంగా మాత్రమే మనం గ్రహించాలి. తన యాత్ర ఆరంభంలో అప్పటి విధానం ప్రకారం వీరాస్వామయ్య మద్రాసు దొరలనుండి "క్యారక్టర్లు" (ఇతర స్థలాలలో ఉండే అధికారులకు తనగురించిన పరిచయ పత్రాలు కావచ్చును) తీసుకొని వెళ్ళాడు. అవి చూసి, దేశమంతటా దొరలు, సంస్థానాధీశులు వీరాస్వామయ్యను విశేషంగా మన్నించి అతని అవసరాలన్నీ సమకూర్చారు. గవర్నరు లాంటి హోదా ఉద్యోగులు కూడా అతనిని మన్నించారు. ఆ కాలంలో సంస్థానాధీశులకు మాత్రమే వారి పరివారం ఆయుధాలు ధరించడాని అనుమతి ఉండేది. అలాంటి సదుపాయం వీరాస్వామి పరివారానికి కలుగజేశారు. గంగను దాటే ముందు వీరాస్వామయ్య సామానులను తనిఖీ చేయాలని పట్టు బట్టిన కస్టమ్స్ ఉద్యోగిని ఆపే కమిషనర్ వెంటనే డిస్మిస్ చేశాడు. అయితే అతనిని క్షమించమని వీరాస్వామయ్య కోరాడు.
 
 
తన యాత్ర తనకొక్కడికే పుణ్యవంతం కావాలని అతను కోరుకొనలేదు. నూరు మందికి పైగా ఉన్న తన పరిజనం చేత యాత్రా ఫలసిద్ధికి కావలసిన విధులు, కర్మలు అన్నింటినీ చేయించాడు. దారిలో తన పరిజనానికి ఆయనే వైద్యుడు కూడాను. దారిలో అస్వస్థతకు గురైన నౌకర్లు కూడా యాత్రను పూర్తి చేయాలని స్థానికి కూలీల ద్వారా డోలీలు ఏర్పాటు చేయించాడు. ఆఖరికి స్థానికంగా తెచ్చుకొన్న తాత్కాలిక కూలీకి జ్వరమొస్తే అతనిని మోసుకెళ్ళడానికి మరో నలుగురు కూలీలను నియమించాడు. కాశీలో చలికాలంలో రక్షణ కోసం అందరికీ తగు వస్త్రాలు, నూనెలు కొని ఇచ్చాడు.
 
 
తన యాత్రా ఫలాన్ని తనకొకడికే పరిమితం చేసుకోలేదు. నలభై బిందెల గంగా జలాన్ని పది బాడుగ గుర్రాలమీద చెన్నపట్నం పంపించే ఏర్పాటు చేయించాడు. అయినా ఆ జలం రవాణాకు ఏమయినా అంతరాయం కలుగుతుందేమోనని మరొక ఎనిమిది బిందెల తనవెంట రెండు బండ్లలో తీసుకొని వచ్చాడు. ఆ పుణ్య తీర్ధాన్ని మద్రాసులో ఇంటింటికి పంచాడు.
 
==కాశీయాత్ర==
{{main|ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర మార్గం}}
వీరాస్వామయ్య కాశీయాత్ర జర్నల్ మొదటి వాక్యం ఇది -
:''జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింపదలచి నన్నునేలుచున్న సూప్రీం కోరటు దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని ౧౮౩౦ సంవత్సరము మే నెల ౧౮వ తేదీ కుజవారము రాత్రి ౯ ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము చేరినాను. అది తండయారు వీధిలోనుండే నా తోటకు ౩ గడియల దూరము.''
 
 
ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. షుమారు 15 నెలలు సాగిన ఈ యాత్రలో అతని కుటుంబ స్త్రీ జనం, బంధువులు, పరిజనులు షుమారు 100 మంది పైగా ఉన్నారు. వారు తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాదు, నాగపూరు, ప్రయాగల మీదుగా కాశీ చేరుకొన్నారు. ప్రయాణం అధికంగా పల్లకీలు మోసే బోయల ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. వారు కాశీ నుండి గయ ద్వారా కలకత్తా నగరానికి చేరారు. తరువాత ఉత్కళ ప్రాంతం భువనేశ్వరం, బరంపురంల మీదుగా శ్రీకాకుళం చేరారు. రాజమహేంద్రవరం, బందరు, నెల్లూరుల గుండా తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి రైళ్ళు లేవు. రోడ్లు కూడా సరిగా లేవు. కంకర రోడ్లసలే లేవు. "బాట సరాళము" అంటే మనుషులు, బండ్లు నడవడానికి వీలుగా ఉన్నదని అర్ధం చేసుకోవాలి. అతని యాత్రలో సందర్శించిన కొన్ని ఊళ్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక ఊరి మజిలీకి చెందినవవుతాయి.
 
 
* '''1830 మే 18''' - చెన్న పట్నం, మాధవరం, పాలవాయి సత్రం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము), తిరువళ్ళూరు, కనకమ్మ సత్రం (కార్వేటి నగరం), బుగ్గగుడి, పుత్తూరు, వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం.
; మే 1830:
 
* మే 23 - దిగువ తిరుపతి, తిరుపతి కొండ
 
* మే 30 - కరకరంబాడు, శెట్టిగుంట, బాలపల్లె, కోడూరు, వోగంబాడు, పుల్లంపేట, నందలూరు, అత్తిరాల, భాకరాపేట, వొంటిమిట్ట
 
* కడప, పుష్పగిరి, కాజీపేట, దువ్వూరు, వంగలి
; జూన్ 1830:
 
* జూన్ 2 - అహోబిళం, శ్రీరంగాపురం, రుద్రవరము, మహానంది, బండాతుకూరు, వెలపనూరు, ఓంకారము, వెంపెంట, ఆత్మకూరు, నాగులోటి, పెద్ద చెరువు
 
* జూన్ 16 - శ్రీశైలము, భీముని కొల్లము, పెద్దచెరువు
 
* జూన్ 20 - నివృత్తి సంగమం (కృష్ణ దాటడం), ముసలిమడుగు
 
* జూన్ 21 - సిద్ధేశ్వరం ఘాటు, పెంటపల్లి, పానగల్లు, చిన్నమంది, వనపర్తి, గణపురం, చోళీపురం, మనోజీపేట, జడచర్ల, నాగనపల్లె (బాలనగరం), జానంపేట (ఫరక్కునగరం), షాపురం
 
* జూన్ 29 - హైదరాబాద్ (బేగం బజారు)
;జూలై 1830:
 
* జూలై 8 - సికింద్రాబాదు, గోల్కొండ
 
* జూలై 20 - మేడిచర్ల, మాషాపేట, బిక్కనూరుపేట, కామారెడ్డిపేట, మల్లుపేట, యాదలవాయి, జగనంపల్లె, వేములవాడ, దూదుగాం, స్వర్ణ, ఆర్మూరు, రామనపేట
 
* జూలై 31 - (గోదావరి దాటడం), నిర్మల (కుశ దర్పణం)
;ఆగస్టు 1830:
 
* ఆగష్టు 2 - వొడ్డూరు, విచ్చోడా, యేదులాబాదు (పిన్నగంగ దాటడం), గూంగాం
 
* ఆగష్టు 14 - నాగపూరు
* ఆగష్టు 21 - కామిటి
* ఆగష్టు 26 - రామటెంకి
;సెప్టెంభరు 1830:
* సెప్టెంబరు 6 - నర్మదావది దాటడం, తిలవారా
* సెప్టెంబరు 8 - జబ్బల్ పూరు
* సెప్టెంబరు 22 - రీమా
* సెప్టెంబరు 29 - మిరిజాపూరు
;అక్టోబరు 1830:
* అక్టోబరు 9 - వింధ్యవాసిని
* అక్టోబరు 12 - ప్రయాగ (అలహాబాదు)
* అక్టోబరు 23 - గంగమీద ప్రయాణం
* అక్టోబరు 27 - కాశీ, హరిద్వాఱము, గంగోత్రి, బదరీ నారాయణము, కాశ్మీరము
 
* డిసెంబరు 17 - గయకు ప్రయాణం, గాజీపూరు
* డిసెంబరు 28 - పట్నా, జ్వాలా ముఖి, దేవప్రయాగ
* జూన్ 30 - గంజాం (ఋషికుల్య నది)
* జూలై 1 - నాయుడిపేట, ఛత్రపురం, బరంపురం
 
* జూలై 3 - ఇచ్ఛాపురం, గంజాం జిల్లాలోని రేవులు, కంచర్ల, పలాస, రఘునాధపురం, హరిశ్చంద్రపురం, నరసన్నపేట, రావులవలస
 
* జూలై 7 - శ్రీకాకుళము, శ్రీకూర్మము
 
* జూలై 9 - వెజ్జపురం, గిరివాడిపాళెం, గంజాం మరియు విజయనగరం తాలూకాలలోని అగ్రహారాలు, మహాస్థలాలు
 
* జూలై 10 - విజయనగరం, ఆలమంద, సబ్బవరం, సింహ్వాచలము, కసంకోట, అనకాపల్లి, యలమంచిలి, దివ్యల, నక్కపల్లి, వుపమాకా, తుని, నాగలాపల్లి, యానాం, నీలపల్లి, యింజరము, మాదయ పాళెము, వుప్పాడా
 
* జూలై 20 - పిఠాపురము, పెద్దాపురము
 
* జూలై 21 - రాజానగరము
 
* జూలై 21 - రాజమహేంద్రవరము, కాకినాడ, కోనసీమ, ధవిళేశ్వరం, భద్రాద్రి, కోరంగి
 
* జూలై 28 - గోదావరి దాటడం, వాడపల్లి, రాల (ర్యాలి), ఆచంట, శింగవృక్షము, బొండాడ, యేలూరిపాడు, కలిదండి. తుమ్మడి
 
* ఆగష్టు 2 - మచిలీ బందరు
 
* కొత్తపాళెం - చల్లపల్లి, కళ్ళేపల్లి
 
* ఆగష్టు 19 - కృష్ణానదిని దాటడం, కనగాల, భట్టుప్రోలు, లంజదిబ్బ, చందవోలు, బాపట్ల, వేటపాళెం, చినగంజాం, అమ్మనబోలు, ఆకులల్లూరు, వెలగపూడి సత్రము, కరేడు, కొత్త సత్రము, జువ్వులదిన్నె, పంటల్లూరు, కొడవలూరి సత్రం
 
* ఆగష్టు 14 - పినాకినీ నదిని దాటడం, నెల్లూరు
 
* ఆగష్టు 27 - మనుబోలు, గూడూరు, నాయుడుపేట, బ్రాహ్మణపుదూరు, దొరవారి కోనేరు, మన్నారు పోలూరు (కోటపోలూరు), చిలకలపూడి రామస్వామి సత్రం, సుళూరుపేట, గుమ్మడిపూడి
 
* సెప్టెంబరు 1 - పొన్నేరి, విచ్చూరు
* సెప్టెంబరు 2 - తిరువట్టూరు
 
* '''1831 సెప్టెంబరు 3''' - చెన్నపట్టణము
 
 
ఈ వ్యాసంలో వీరాస్వామయ్య గురించిన విశేషాలు పై రెండు పుస్తకాలనుండి సేకరింపబడ్డవి.
==యివి కూడా చూడండి==
 
* [[కాశీయాత్ర చరిత్ర]]
* [[ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర మార్గం]]
==బయటి లింకులు==
*[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2004080403250500.htm&date=2004/08/04/&prd=th& 2004లో హిందూ పత్రికలో ప్రచురించబడిన వ్యాసం.]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1355042" నుండి వెలికితీశారు