సిద్ధవటం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
'''సిద్ధవటం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. కడప నుంచి [[భాకరాపేట]] మీదుగా [[బద్వేలు]] వెళ్ళే మార్గంలో [[పెన్నా నది|పెన్నా]] నది ఒడ్డున సిద్ధవటం ఉంది. కడప నుంచి ఇక్కడికి 20 కి.మీ. దూరం. సిద్ధులు నివసిస్తున్న వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చింది. సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో [[జైన మతము|జైనులు]] నివసిస్తూ ఉండేవారు. 1807 నుంచి 1812 వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేది. అయితే పెన్నానది పొంగినప్పుడల్లా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి కడపకు మార్చారు. 1956లో సిద్ధవటం కోట పురావస్తుశాఖ ఆధీనంలోకి వచ్చింది. సిద్ధవటం సమీపంలో ఏటి పొడవునా దేవాలయాలున్నాయి. రంగనాథస్వామి ఆలయం చెప్పుకోదగినది. ఇక్కడి ష్మశానవాటికలో భాకరాపంతులు పేర నిర్మించిన 16 స్తంభాల మంటపం ఉంది. సిద్ధవటం దోసకాయలకు ప్రసిద్ధి.
==== చరిత్ర ====
విజయనగర సామ్రాజ్య చక్రవర్తియైన వీర నరసింహదేవరాయలు క్రీ.శ.1506 నుంచి 1509 వరకూ సామ్రాజ్యాన్ని పరిపాలించారు.
===సిద్ధవటం కోట===
ఇక్కడ మధ్యయుగం నాటి కోట ఒకటి ఉంది. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది.
 
==== చరిత్ర ====
మట్లి రాజులు [[నాయంకరం]]గా ఈ కోటను పాలించే నాటికి ఇది మట్టి కోట. [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవరాయల]] అల్లుడు [[వరదరాజు]] మొదట ఈ కోటను పాలించాడు. అంతకు ముందు ఈ కోట [[ఉదయగిరి]] రాజ్యంలో ఉండేది. [[రెండవ వెంకటపతిరాయలు|రెండవ వెంకటపతిరాయల]]కు మట్లి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు. అందుకు గుర్తుగా ఎల్లమరాజుకు అమరనాయంకరంగా సిద్ధవటాన్ని ఇచ్చాడు. మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేర ఎల్లమరాజు చెరువును, తన పేర అనంతరాజు చెరువును త్రవ్వించాడు. అనంతరాజు 'కకుత్‌స్థ విజయము ' అనే కావ్యాన్ని రచించాడు. ఈయన ఆస్థానంలో ఉప్పుగుండూరు వెంకటకవి, కవి చౌడప్ప ఉండేవారు.
 
"https://te.wikipedia.org/wiki/సిద్ధవటం" నుండి వెలికితీశారు