అట్టాడ అప్పల్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
| weight =
}}
'''అట్టాడ అప్పల్నాయుడు''' ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత. ఇతడు [[విజయనగరం]] జిల్లా, [[కొమరాడ]] మండలం [[గుమడ]] గ్రామంలో [[1953]]వ సంవత్సరం [[ఆగష్టు 23]]వ తేదీన జన్మించాడు.<ref>{{cite journal|last1=లాంగుల్య|title=నవ్యనీరాజనం|journal=నవ్యవీక్లీ|date=13-10-2010|pages=27-29|url=http://www.navyaweekly.com/2010/oct/13/page27.asp|accessdate=20 December 2014}}</ref> [[కొతిపం|కోటిపాం]] జిల్లాపరిషత్ హైస్కూలులో పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలో శ్రీకాకుళ సాయుధ పోరాటం వైపు ఆకర్షితుడయ్యాడు. జననాట్యమండలిలో పనిచేశాడు. [[పార్వతీపురం]]లో ఇంటర్‌మీడియెట్ చదివాడు. జంఝావతి రిజర్వాయర్ నిర్మాణంలో కూలీగా పనిచేశాడు. నాగావళి వారపత్రికలో పనిచేశాడు. తరువాత బ్యాంక్ ఉద్యోగం సంపాదించుకున్నాడు.
==రచనలు==
ఇతడు 100కి పైగా కథలు, నాలుగు నవలలు, కొన్ని నాటికలు వ్రాశాడు.తొలి రోజులలో శ్రీకాకుళోద్యమానికి ఆకర్షితుడై విప్లవ కథకుడిగా పేరు సంపాదించాడు. ఇతని నాటకం మడిసెక్క అన్ని భారతీయభాషలలోకి అనువదించబడింది. వరీనియా అనే కలంపేరుతో కథలు వ్రాసేవాడు.