ధూమపానం: కూర్పుల మధ్య తేడాలు

343 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి
చి (Wikipedia python library)
సినిమాలు, టీవీలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రభావంతో చిన్నతనం నుంచే పొగాకు బానిసలవుతున్నారు. దీంతో 20-25 ఏళ్లకే ఎంతోమంది వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. నగరాలలో పబ్ కల్చర్, హుక్కా సెంటర్లు పెరుగుతున్నాయి. వారాంతాలు ఇక్కడ గడిపేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. పబ్ కల్చర్ వల్ల నెమ్మదిగా పొగాకు బానిసలవుతున్నారు. తొలుత సరదాగా స్నేహితులతో దమ్ము కొట్టినా...చివరికి అలవాటు కింద మారుతోంది. సిగరెట్, సింగార్, బీడీ, తంబాకు, గుట్కా ఇలా ఏ రూపంలో తీసుకున్నా అది శరీరానికి హానికరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పొగాకు నోటిలో పెట్టి నమలడం ద్వారా నోరు పొక్కడం తద్వారా ఓరల్ కేన్సర్, గొంతు చిన్నగా మారడం, మాట్లాడలేకపోవడం తదితర ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థి దశ నుంచే ఈ అలవాటు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తున్న అంశం.
 
సరదాగా మొదలైన ధూమపానాన్ని అలవాటుగా మార్చి వ్యసనంగా దిగజార్చే లక్షణం నికొటిన్‌కి ఉంది. సిగరెట్ పొగలో నికొటిన్‌తోపాటు దాదాపు నాలుగువేల రసాయనాలుంటాయి. వాటిలో పందొమ్మిది క్యాన్సర్ కారకాలు! ఈ వాస్తవాలు విస్తృత వ్యాప్తిలోకి వచ్చి ఇతర దేశాల్లో ధూమపానం తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గడచిన మూడు దశాబ్దాల్లో మనదేశంలోనే పొగదాసుల జనాభా 33.8శాతంనుంచి 23శాతానికి పడిపోగా, స్త్రీలలో ధూమపానం జోరెత్తడం విస్తుగొలుపుతోంది. 1980నాటికి 53లక్షలున్న వారి సంఖ్య ఇప్పుడు కోటీ 22లక్షలకు ఎగబాకింది. దేశీయంగా మహిళల్లో సంతానలేమి, క్యాన్సర్ కేసుల పెరుగుదలకు ధూమపానానికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ప్రస్ఫుటమవుతోంది. పొగతాగడంపై నిషేధాంక్షల్ని అమలుపరుస్తున్న అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో నెలలు నిండని జననాలు, పిల్లల్లో ఉబ్బసం కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అందుకు విరుద్ధంగా, దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం మూలాన ఆరోగ్య సమస్యల ఉత్పాతం తీవ్రంగా ఆందోళనపరుస్తోంది! ఇండియాలో నేడు ధూమకేతుల మొత్తం సంఖ్య సుమారు పదకొండు కోట్లు. గుట్కా, పాన్‌మసాలా వాడకందారులకు అంతే లేదు. పొగాకు వినియోగంవల్ల క్యాన్సర్లు, గుండెజబ్బులతోపాటు మధుమేహం, కీళ్లవాతం, అంధత్వం తదితర సమస్యలూ కమ్ముకుంటాయని తాజా అధ్యయనాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. జనచేతనపై దృష్టి నిమగ్నం చేయడంద్వారా ఇతర దేశాలెన్నో సత్ఫలితాలు సాధిస్తుండగా- పన్నుల పెంపు, నామమాత్ర హెచ్చరికలకే పరిమితమవుతున్న దేశీయ ఉదాసీన ధోరణులు ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. తాజా పరిశోధనల్లో ధూమపానం వల్ల నపుంసకత్వం సంభవిస్తుందని, ఈ నపుంసకత్వం తరతరాలకు సంక్రమించే అవకాశం ఉందని ఫలితాలను వెల్లడించాయి.
 
==మహిళల్లో పెరుగుతున్న అలవాటు==
9

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1358747" నుండి వెలికితీశారు