మురళీధర్ దేవదాస్ ఆమ్టే: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = మురళీధర్ దేవదాస్ ఆమ్టే
| image = Baba Amte (1914-2008).jpg
| caption = బాబా ఆమ్టే
| birth_date = {{birth date|df=yes|1914|12|26}}<ref>{{cite web| url=http://timesofindia.indiatimes.com/india/Amte-the-great-social-reformer/articleshow/2768984.cms/|title=Amte, the great social reformer}}</ref>
| birth_place = [[Hinganghat]], [[British Raj|British India]] (present-day [[Maharashtra]], [[India]])
| death_date = {{death date and age|df=yes|2008|2|9|1914|1|11}}
| death_place = [[Anandwan]], Maharashtra, India
| nationality = [[demographics of India|Indian]]
| Education = B.A.LL.B.
| spouse = Sadhana Amte
| children = [[Vikas Amte|Dr. Vikas Amte]]<br />[[Prakash Amte|Dr. Prakash Amte]]
| Religion = [[Atheism]]
| Awards = Padma Shri, Padma Shri, Ramon Magsaysay Award
| signature = BabaAmte Autograph(Eng).jpg
| webpage = http://www.anandwan.in/baba-amte.html
}}
'''బాబా ఆమ్టే''' (Baba Amte) (Marathi: बाबा आमटे) [[డిసెంబర్ 26]], [[1914]]న [[మహారాష్ట్ర]]లోని [[వార్థా]] జిల్లా [[హింగన్‌ఘాట్‌]]లో జన్మించాడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా [[కుష్టు]] రోగుల పాలిట దేవుడిగా మారినాడు. కుష్టురోగుల సేవలకై [[చంద్రాపూర్]] జిల్లాలో [[ఆనంద్‌వన్]] ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి [[2008]], [[ఫిబ్రవరి 9]]న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన అతని కృషి మరవలేనిది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా లభించాయి.
[[దస్త్రం:Baba Amte (1914-2008).jpg|right|thumb|200px|బాబా ఆమ్టే]]
==తొలి జీవితం==
బాబా ఆమ్టే మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింఘన్‌ఘాట్ లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే బాబాగా పిల్వబడ్డాడు. బాబా అనేది ఎవరో ప్రధానం చేసిన బిరుదు కాదు అది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు.<ref> http://www.rediff.com/freedom/amte3.htm </ref> అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ అమ్టే కాగా అందరిచే బాబా ఆమ్టే గానే పిల్వబడ్డాడు. న్యాయశాస్త్రంలో శిక్షణ పొందిన తరువాత వార్థాలో న్యాయ అభ్యాసం ప్రారంభించాడు. అదే సమయంలో భారత జాతీయోద్యమ పోరాటం జరుగుతుండేది. [[క్విట్ ఇండియా]] ఉద్యమ సమయంలో అరెస్ట్ కాబడిన జాతీయ నేతల తరఫున కోర్టులలో వాదించేవాడు. క్రమక్రమంగా [[మహాత్మా గాంధీ]] వైపు ఆకర్షితుడైనాడు. గాంధీజీతో పాటు కొంత కాలం [[సేవాగ్రం ఆశ్రమం]]లో గడిపినాడు. ఆ తరువాత జీవితాంతం వరకు గాంధీజీ సిద్ధాంతాలకే కట్టుబడినాడు. వేషధారణలో కూడా గాంధీజీ వలె ఖద్దరు దుస్తులనే వాడేవాడు. గాంధీజీ వలె జీవితాంతం అణగారిన వర్గాల కృషికై పాటుపడ్డాడు.