పచ్చయప్ప కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
'''పచ్చయప్ప కళాశాల''' ([[ఆంగ్లం]]: Pachaiyappa's College) [[మద్రాసు]] లోని ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది [[1842]] సంవత్సరంలో [[పచ్చయప్పా ముదలియార్]] [[వీలునామా]]ను అనుసరించి స్థాపించబడినది.
== నేపథ్యం ==
పచ్చయ్యప్ప కళాశాలను విద్యాదాత పచ్చయప్ప మొదలియార్ తన వీలునామాలో విద్యాదానం కొరకు కేటాయించిన సొమ్ముతో నిర్మించారు. పచ్చయప్ప మరణానంతరం వారు వ్రాసిన విల్లుకు వ్యతిరేకంగా, పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన లక్షలాది రూపాయల సొమ్మును వారసులు తినివేశారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ చెన్నై సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ కాంప్టన్, ఆయన అనంతరం వచ్చిన మరొక అడ్వకేట్ జనరల్ నార్టన్ పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన సొమ్మును న్యాయపరంగా వెలికితీయించారు. ఆ వెలికి తీసిన సొమ్మును పచ్చయప్ప వీలునామా మేరకు ధర్మకార్యాలకు ఖర్చుచేసేందుకు [[1832]]లో ధర్మకర్తల బోర్డు ఏర్పాటుచేశారు. ఆ బోర్డులో పోలీసు సూపరింటెండెంటు, దాత [[వెంబాకం రాఘవాచార్యులు]] అధ్యక్షునిగా, ప్రముఖ విద్యాదాత [[కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై]] ఒకానొక ధర్మకర్తగా ఉన్నారు. [[1842]]లో వెంబాకం రాఘవాచార్యులు మరణించాకా అప్పటి నుంచి శ్రీనివాసపిళ్ళై అధ్యక్షుడై [[1852]]లో తాను మరణించేవరకూ కొనసాగారు. ఈ క్రమంలోనే ఆ ధర్మనిధితో పచ్చయప్ప కళాశాలను నిర్మించారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
===పచ్చయప్పా ముదలియార్===
 
"https://te.wikipedia.org/wiki/పచ్చయప్ప_కళాశాల" నుండి వెలికితీశారు