తెలంగాణా సాయుధ పోరాటం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==నేపథ్యం==
తెలంగాణ సాయుధ పోరాటానికి మూలాలు నిజాం నిరంకుశ పాలనలో ఉందని చారిత్రికులు పేర్కొన్నారు. హైదరాబాద్ రాజ్యంలో పాలకుడు ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ స్థాయి నుంచి గ్రామాల్లోని దొరల వరకూ సాగిన అణచివేత విధానాలకు నిరసనగా ఈ పోరాటం మొలకెత్తింది. వెట్టి చాకిరి, భావవ్యక్తీకరణపై తీవ్ర ఆంక్షలు, మాతృభాషలపై అణచివేత, మతపరమైన నిరంకుశ ధోరణులు వంటి ఎన్నో పరిణామాలు నేపథ్యంగా నిలిచాయి. ఇవే కాక ప్రభుత్వం ప్రజలపై బలవంతులైన దొరలు, ఇతర శక్తులు దౌర్జన్యం చేయడాన్ని అడ్డుకోలేదు. 1830ల్లోనే హైదరాబాద్ రాజ్య స్థితిగతుల గురించి తన కాశీయాత్రచరిత్రలో వ్రాసిన తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఈ విషయాలు ప్రస్తావించారు. 1820-30ల నడుమ రెండు సార్లు హైదరాబాద్ రాజ్యాన్ని, నగరాన్ని సందర్శించిన ఆయన హైదరాబాద్ నగరంలో ఆయుధపాణులైన వ్యక్తులు మెత్తనివారిని(బలహీనులను) కొట్టి నరికే పరిస్థితి వుందని, అందుకు గాను యాత్రికులు విధిగా కొందరు బలవంతులైన ఆయుధపాణులను తీసుకునే బయట తిరగాల్సివుంటుందని వ్రాశారు. సుంకాల వసూలు వ్యవస్థను గురించి వ్రాస్తూ హైదరాబాద్ నగరంలో సుంకాలు వసూలుచేసేవారు సరిగా ఇవ్వనివారిని ''చంపినా అడిగే దిక్కులేద''ని వ్రాసుకున్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
=== వెట్టి చాకిరి సమస్య ===
గ్రామాలపై పెత్తనం వహించే దొరలకు, గ్రామాధికారులకు గ్రామాల్లోని వివిధ వృత్తులవారు వెట్టి చాకిరీ చేసే పరిస్థితులు నిజాం పాలన కాలంలో నెలకొన్నాయి. దొర ఇళ్లలో జరిగే వివిధ వేడుకలకు, శుభకార్యాలకు గ్రామంలోని అణచివేయబడ్డ కులాల వారి నుంచి మొదలుకొని వ్యాపారస్తులైన కోమట్ల వరకూ ఉచితంగా పనిచేయవలసి రావడం, డబ్బుతో పనిలేకుండా సంభారాలు సమకూర్చడం వంటివి జరిగేవి. గ్రామంలోకి పై అధికారులు వచ్చినప్పుడు జరిగే విందు వినోదాలకు ధాన్యం, మాంసం, కాయగూరలు వంటివి ఇవ్వడానికి ఊరందరికీ బాధ్యతలు పంచేవారు. వంట పని, వడ్డన పని మొదలుకొని అన్ని పనులూ పంచబడేవి. ఇదే కాక నిత్యం దళిత కులాలకు చెందిన వెట్టివారు అధికారులు, దొరల ఇళ్ళలో వెట్టిపని చేసి దయనీయంగా జీవితాన్ని గడపవలసి వచ్చేది. తెలంగాణా సాయుధ పోరాటం ప్రారంభమయ్యాకా ప్రజలను ఉత్తేజపరిచే పోరాటగీతాల్లో కూడా విరివిగా వెట్టిచాకిరీ సమస్య చోటుచేసుకుంది.