సికింద్రాబాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
== చరిత్ర ==
[[దస్త్రం:SecbadRlwStn.jpg|thumb|right|200px|సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న రైలు]]
బ్రిటిష్ వారు మూడవ [[నిజాం]] అయిన [[సికిందర్ జా]] పరిపాలన కాలంలో హైదరాబాదులో కంటోన్ మెంట్ ప్రాంతాన్ని స్థాపించారు. ఇతని జ్ఞాపకార్ధం దీనికి "సికింద్రాబాదు" అని పేరుపెట్టారు. 1820లో ఒకసారి 1830లో మరోసారి తన కాశీయాత్రల్లో భాగంగా సికిందరాబాద్ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని సందర్శించి తన కాశీయాత్రచరిత్రలో నాటి విశేషాలు వ్రాశారు. 1830లో రెండవసారి వచ్చినప్పుడు రాసిన కాశీ యాత్రాచరిత్రలో తాను మొదటిసారి పదేళ్ళక్రితం వచ్చిననాటి కన్నా కుంఫిణీ లష్కర్(ఈస్టిండియా కంపెనీ కంటోన్మెంట్) బాగా విస్తరించడాన్ని చూసి ఆశ్చర్యం చెందారు. హైదరాబాద్ నగరం కన్నా లష్కరు పెద్దగా ఎదుగుతోందని తన అభిప్రాయం వ్రాశారు. హైదరాబాద్ నగరంలో న్యాయవిచారణ సరిగా లేకుండడంతో సక్రమమైన న్యాయవిచారణ, సరియైన భద్రత కోసం పలువురు వ్యాపారస్తులు తమ నివాసాలు దండు ప్రాంతం(సికిందరాబాద్)కే మార్చుకుంటున్నారని ఆయన రాశారు.
సికింద్రాబాదుని 1948 వరకు బ్రిటీషువారు పాలించగా, హైదరాబాదులో నిజాం రాజుల పాలన ఉండేది.తొలుత ఓ ప్రత్యేక కార్పొరేషన్‌గా ఆవిర్భవించి ఆపై హైదరాబాద్‌లో అంతర్భాగంగా మారింది.1950లో ప్రత్యేకంగా రూపొందించిన చట్టం మేరకు సికింద్రాబాద్‌ నగర పాలక సంస్థ (మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌) అనే స్థానిక పురపాలక సంస్థ ఏర్పాటైంది. కార్పొరేషన్‌గానే సికింద్రాబాద్‌ నగర పాలక సంస్థ తన కార్యకలాపాల్ని నిర్వర్తించేది. 28 మంది ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లుగా వ్యవహరించే వారు. 1960 ఆగస్టు మూడో తేదీన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌ కార్పొరేషన్‌ను హైదరాబాద్‌ నగర పాలక సంస్థలో విలీనం చేసింది. అయితే, సికింద్రాబాద్‌ ప్రాంతవాసులకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వ ప్రముఖులు సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లలో ఒకరు తప్పనిసరిగా ఎం.సి.హెచ్‌.కు డిప్యూటీగా వ్యవహరించే పద్ధతిని ప్రారంభించారు.అనంతరం హైదరాబాద్‌ ప్రాంతానికి చెందినవారు మేయర్‌గా ఎన్నికయ్యే పక్షంలో సికింద్రాబాద్‌కు చెందిన కార్పొరేటర్‌ను డిప్యూటీ మేయర్‌గా, సికింద్రాబాద్‌కు చెందిన ప్రతినిధి మేయర్‌గా ఎన్నికయ్యే పక్షంలో హైదరాబాద్‌కు చెందిన కార్పొరేటర్‌ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యేలా ఏర్పాట్లు చేశారు.గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆవిర్భవించే వరకూ ఎం.సి.హెచ్‌. పరిధిలో కొనసాగిన ఏడు సర్కిళ్లలోసికింద్రాబాద్‌ సర్కిల్‌ ను డివిజన్‌గా పరిగణించారు.
సికింద్రాబాద్‌ అదనపు కమిషనర్‌ హోదాను కూడా పెంచి, ఐ.ఏ.ఎస్‌. అధికారి ఈ పోస్టులో కొనసాగేలా తీర్చిదిద్దారు.2007లో హైదరాబాద్‌ను గ్రేటర్‌గా రూపొందించిన వెంటనే నగరంలోని అన్ని సర్కిళ్ల సరసనే సికింద్రాబాద్‌ సర్కిల్‌ను చేర్చి దాని ప్రత్యేకాధికారాలు, స్వయం ప్రతిపత్తిని పూర్తిగా తొలగించారు.
"https://te.wikipedia.org/wiki/సికింద్రాబాద్" నుండి వెలికితీశారు