సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:అంతరిక్షం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
మన దేశంలోనే రాకెట్‌, ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఏర్పడిందే శ్రీహరికోట రాకెట్‌ లాంచింగ్‌ . ఈ కేంద్రం భూమధ్యరేఖకు 13 డిగ్రీల అక్షాంశంలో ఉంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన రాకెట్ భూమ్యాకర్షణ శక్తిని తేలిగ్గా అధిగమించి అంతరిక్షంలోకి అనుకున్న విధంగా పంపవచ్చు. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా,13డిగ్రీల అక్షాంశంతో శ్రీహరికోట కేంద్రం రెండో స్థానంలో కొనసాగుతోంది. రాకెట్ కేంద్రంగా గుర్తింపు పొందిన తర్వాత మొదట షార్ నుంచి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.1971, అక్టోబర్ 9న రోహిణి-125 సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అది మొదలు, ఇప్పుడు చంద్రయాన్-1 దాకా శ్రీహరికోట ఎన్నో కీలక ప్రయోగాలకు వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002, సెప్టెంబర్ 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా మార్చారు.
దక్షిణ అమెరికా ఖండంలోని కొరూ (ఫ్రెంచ్ గయానా) తర్వాత అంత అనువైన రాకెట్ ప్రయోగకేంద్రం ఇదే. ఆంధ్రప్రదేశ్‌లో పులికాట్ సరస్సు- బంగాళాఖాతాల నడుమ 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం అంతరిక్ష పరిశోధనలకు కీలక వేదిక. తూర్పుతీరంలో భూమధ్య రేఖకు సమీపంలో సముద్రం ఒక వైపు, పులికాట్ సరస్సు మరోవైపు ఉండటం రాకెట్ ప్రయోగదిశలో భూభాగాలేవీ లేకపోవడం ప్రయోగాలకు అత్యంత అనువుగా ఉంటోంది. శ్రీహరికోటలో రెండు లాంచింగ్ ప్యాడ్‌లు ఉండగా మూడోదీ ఏర్పాటు చేయనున్నారు. అక్టోబర్ 9, 1971లో మొదటిసారిగా సౌండ్ రాకెట్‌ను ఇక్కడి నుంచి ప్రయోగించారు. అసెంబ్లింగ్, టెస్టింగ్‌తో పాటు ప్రయోగాలకూ ఇది వేదికగా ఉంది. ఇప్పటిదాకా 575 సౌండ్ రాకెట్లనూ 42కు పైగా ఉపగ్రహాలనూ ప్రయోగించారు. ఇది భారతదేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. ఇక్కడనుండి ఎన్నో PSLV మరియు GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇక్కడ రెండు లాంచ్ ప్యాడ్‌లు ఉన్నాయి. ఈ రెండిటివల్ల ప్రతి ఏడాది 6 శాటిలైట్లను ప్రయోగించే వీలు ఉన్నది.
 
[[వర్గం:అంతరిక్షం]]