కృష్ణమాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
తెలుగున తొలి వచనకావ్యకర్తయు, వచన సంకీర్తన వాజ్మయమునకు మూల పురుషుడును, వైష్ణవభకతాగ్రేసరుడు నగు ఈ కృష్ణామాచార్యుడు [[కాకతీయులు]] చక్రవర్తులలో కడపటి వాడగు రెండవ [[ప్రతాపరుద్రుడు]] కాలమున, అనగా క్రీ.శ.1295 నుండి 1326 వరకు గల కాలమున వెలసిల్లె నని [[ప్రతాపచరిత్రము]], [[ఏకశిలానగర వృత్తాంతము]] ను చెప్పుచున్నవి. తిరుపతి దేవస్థానమున సంకీర్తనాచార్యులలో ప్రధములు [[తాళ్ళపాక అన్నమాచార్యులు]] గారు కృష్ణమాచార్యుని తమ [[సంకీర్తనలక్షణము]] న పేర్కొనుటచే ఈకాలము ధ్రువమగుచున్నది. అన్నమయ్యగారి మనుమడు చిన్నన్న తన [[పరమయోగివిలాసము]] న ఈతననిని ప్రశంసించియున్నాడు. ఇంతేకాక [[ఆచార్య సూక్తి ముక్తావళి]] యందు ఈతని ప్రశంస కలదు. వీనిని బట్టి చూడ కృష్ణమాచార్యుడు వైష్ణవమత వాజ్మయమున ఆంధ్రదేశమున ప్రధమాచార్యుడని చెప్పవచ్చును.<ref>{{cite book|last1=శేషయ్య|first1=చాగంటి|title=ఆంధ్రకవి తరంగిణి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aan%27dhra%20kavi%20taran%27gind-i%20gran%27tha%2014&author1=&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1949%20&language1=Telugu&pages=287&barcode=2030020029705&author2=&identifier1=&publisher1=aan%27dhra%20prachaarind-i%20limit%27ed%27&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=&numberedpages1=264&unnumberedpages1=25&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0191/560|accessdate=2 January 2015}}</ref>
 
ఈతడు [[సింహాచలం]] క్షేత్ర నివాసి అని, సింహాచల నరసింహస్వామికి భక్తుడై అతని పేర అనేక సంకీర్తనలు రచయించెనని [[సింహాచలక్షేత్ర మహత్యము]] తెలుపుచున్నది. సింహగిరి నరహరివచనము లను పేర సంకీర్తనలు కృష్ణమాచార్యుల వారివి నేటికిని వెలయచుండుటచే నిది నిజమని చెప్పవచ్చును.
"https://te.wikipedia.org/wiki/కృష్ణమాచార్యుడు" నుండి వెలికితీశారు