వేములవాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దు
పంక్తి 16:
అలాగే ఈ భీమన్న ఆలయ సమీపంలో పోచమ్మ ఆలయం కూడా కలదు. ఈ ఆలయం లో భక్తులు తమ మొక్కుబడులను (అంటే కోడి , మేక వంటి జంతువులను అమ్మవారికి భలి ఇచ్చి) తీర్చుకుంటారు.
 
వేరే ప్రాంతాలనుండి భక్తులు ఇక్కడికి వచ్చి రాజరాజేశ్వర స్వామిని, భీమన్న ని, అమ్మవారిని దర్శించుకుని రాత్రి పూట ఒక నిద్ర తీసి వెలతారు, అలా చేయటం వలన తమకు ఉన్న దోశాలు తొలగిపోతాయని వారి నమ్మకం. అందుకు గాను ప్రభుత్వ వసతి గృహాలు ఇక్కడ ఉన్నయి, ప్రభుత్వ వసతి గృహాలతో పాటు ప్రైవేటు వసతి గృహాలు కూడ మనం ఇక్కడ చూడవచ్చు.
 
నిద్రకోసం వచ్చే భుక్తుల కు కాళక్షేపం కోసం వసతి గృహాలకు దగ్గరలో సినిమా హాల్లు కూడా ఉన్నయి.
పంక్తి 24:
వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉన్నది.
 
1830ల్లో కాశీయాత్రలో భాగంగా నాటి నైజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్ళిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్రచరిత్రలో ప్రస్తావించారు. తన యాత్రామార్గంలోని మజిలీల్లో ఇక్కడికి సమీపమైన మజిలీ జగనంపల్లి (డిచ్‌పల్లి సమీపంలోని గ్రామం) గురించి వ్రాస్తూ అక్కడికి 4 మజిలీల దూరంలో [[వేములవాడ]] ఉన్నదని వ్రాశారు. అది మహాక్షేత్రమని, భీమేశ్వర రాజేశ్వర క్షేత్రమని పేర్కొన్నారు. వేములవాడ భీమకవి జన్మస్థలమని వ్రాశారు. అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని, కోడెలను పులులు బాధించేవని పేర్కొన్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
==శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం==
"https://te.wikipedia.org/wiki/వేములవాడ" నుండి వెలికితీశారు