గణపతి సచ్చిదానంద స్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==దత్త పీఠం==
1. విశ్వప్రార్థనా మందిరము : దత్తపీఠం మూలస్థానం, మహా శక్తిమంతమైన కాలాగ్నిశ దత్తాత్రేయ ఆలయం, నిత్య హోమశాల, సచ్చిదానందేశ్వర, లక్ష్మీనరసింహ దేవాలయాలు, సకల ధర్మ సమన్వయ కేంద్రం.
 
2. నాదమండపం : సంగీతానికి అంకితమైన అద్భుత సభామండపం, సప్తస్వర దేవతా మండపం, 22 శ్రుతిస్థానాలకు ప్రతీకగా 22 స్తంభాలమీద నిలబడిన విసనకర్ర ఆకారంలోని సుందర మండపం.
 
3. శ్రీగణపతి సచ్చిదానంద వేద పాఠశాల : [[ఋగ్వేదం]], [[యజుర్వేదం]], [[సామవేదం]], స్మార్తప్రయోగం, సంస్కృత పాఠశాల, అర్చక శిక్షణాకేంద్రము, నంద గ్రంథాలయం ఉన్నాయి.
 
4. శ్రీదత్త వేంకటేశ్వరస్వామి దేవస్థానము : కారణికంగా ప్రతిష్ఠితమైన మహిమాన్విత సన్నిధి, పద్మావతి, ధన్వంతరి, గణపతి, నవగ్రహ, సర్వదోషహరశివ, మరకత సుబ్రహ్మణ్య ఆలయ సముదాయం)
 
5. విశ్వం - ప్రదర్శనశాల : ప్రపంచవ్యాప్తంగా శ్రీస్వామీజీకి అందిన అరుదైన శిల్ప, కళాఖండాలకు, ప్రశస్తమైన రత్నాలకు, సంగీతవాద్యాలకు, చిత్రవిచిత్ర వస్తు విశేషాలకు ఆలవాలం.
 
6. కిష్కింధ మూలికావనం: భారతదేశంలోనే అతి పెద్దదైన సుందరమైన వామన వృక్షవనం ( బోన్సాయి గార్డెన్), మనకు ప్రకృతి సంరక్షణా స్ఫూర్తి నిచ్చే మహోద్యమం.
 
7. సప్తర్షి తీర్థం : భూమండలం మీద అనేక పవిత్ర తీర్థాలతోపాటుగా, విలువైన మూలికలు, ప్రశస్త రత్నాల జలాలతో భక్తులు స్నానం చేసే పుష్కరిణి, శరీర రుగ్మతలను దూరం చేసి సంజీవనం.
 
8. నక్షత్ర, నవగ్రహ రాశి వనం : శాస్త్రంలో పేర్కొన్నవిధంగా 27 నక్షత్రాలు, 12 రాశులు, సప్తర్షులు, పంచాయతన దేవతలు, నవగ్రహదేవతావృక్షాల అరుదైన ప్రశాంత ఉద్యానవనం .
 
9. ధర్మధ్వజం: సకల విజ్ఞాన తత్వ్తాల సారం పరబ్రహ్మము అని చాటిచెప్పే అద్భుతమైన ఏకశిలా స్థూపం. 40 నిమిషాల పాటు వినసొంపుగా తత్త్వాన్ని తేలియపరిచే ధ్వని సమేతమైన కాంతి ప్రదర్శన.
 
10. సుమేరు ధ్యాన మందిరం: క్రియాయోగ సాధనకు, ధ్యానానికి అనువైన త్రికోణాకార భవనము, అన్ని చికాకులు తొలగిపోవాలంటే యోగమే సులభోపాయం అని నిరూపించే నిదర్శనం.
 
11. జయలక్ష్మీ మాత అన్నపూర్ణా మందిరము : దత్త పీఠానికీ విచ్చేసే వేలాదిమంది భక్తులకు నిరంతరం అన్నదానం జరిగే ప్రదేశం. ఈ అన్నదాన సేవలో పాలుపంచుకోవడం మహభాగ్యము.
 
12. ఎస్. జి. ఎస్. ఉచిత వైద్యశాల : పంచకర్మ మెదలైన ఆయుర్వేద చికిత్సా విధానాలతో పాటు ఆధునిక వైద్యసేవలు, చికిత్సా శిబిరాల ద్వారా వేలాదిమంది ప్రజలకు ఉపకరించే సేవాకేంద్రం.
 
==ఇతర మఠాలు==