గణపతి సచ్చిదానంద స్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
 
==దత్త పీఠం పండుగలు==
===శ్రీ స్వామీజీ వారి జన్మదినోత్సవం===
ఈ ఉత్సవాలు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికి దీక్షగా జరుగుతాయి. సామాన్యంగా మే, జూన్ ప్రాంతాలలో వస్తాయి. ఈ సందర్భంగా గొప్ప యజ్ఞాలు, మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అఖిల భారత జ్ఞాన బోధ సభా సమ్మేళనం, వేదపరీక్షలు జరుగుతాయి. అంతర్జాతీయ ప్రతిష్ఠాకరమైన వేదనిధి, నాదనిధి, శాస్త్రనిధి, దత్తపీఠ ఆస్థాన విద్వాన్ ఇత్యాది బిరుదులతో ఉత్తమోత్తమ పండితులకు పురస్కారాలు జరుగుతాయి. ఈ సందర్భములోనే శ్రీదత్త వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవములు కూడా జరుపబడును.
===శ్రీదేవి నవరాత్రులు===
తొమ్మిది రోజులు జరగే ఈ ఉత్సవాలు సంపూర్ణమైన పూజా కార్యక్రమాలతోను, నాదసేవాకార్యక్రమాలతోను నిండి ఉంటాయి. ఈ తొమ్మిది రోజులలో శ్రీస్వామీజీలో అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది. సామాన్యంగా సెప్టెంబరు, అక్టోబరు మాసాలలో వస్తూ ఉంటుంది.
===దత్త జయంతి ===
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాత్మకుడైన ఆదిగురు దత్తాత్రేయ స్వామి జన్మదిన మహా పర్వదినమిది. మార్గశీర్ష పూర్ణిమ, ఇది సామాన్యంగా డిసెంబరులో వస్తుంది. ఇది మూడురోజుల ఉత్సవం. విశేషమైన దత్తపూజలు. దత్తహోమాలు ఉంటాయి.
===శివరాత్రి===
శ్రీ స్వామీజీ అగ్నికుండంలో దిగి హోమం చేసేది ఈ ఉత్సవంలోనే. ఇది ఒకరోజు ఉత్సవం రాత్రంతా శ్రీసచ్చిదానందేశ్వరుడికి అభిషేకాలు, రుద్రహోమం జరుగుతాయి కైలాసం దిగి వచ్చినట్లుంటుంది, ఫిబ్రవరి, మార్చి నెలలలో ఉంటుంది. ఈ పై నాలుగు ఉత్సవాలలోనూ శ్రీస్వామీజీ సామాన్యంగా మైసూర్ దత్తపీఠంలోనే ఉంటారు.
===జయలక్ష్మీ మాత జయంతి===
ఈమె శ్రీ స్వామీజీ వారి తల్లి. యోగ దీక్షాగురువు కూడా ఈ మహాతల్లి జన్మంచినది, పరమపదించినది కూడా శంకరజయంతి నాడే. ఇది ఒక రోజు ఉత్సవం. సామాన్యంగా ఏప్రిలే, మే మసాలలో వస్తుంది.
===శ్రీ నరహరి స్వామి ఆరాధన===
శ్రీ స్వామీజీవారి తండ్రి శ్రీ నరహరి తీర్థస్వామివారి ఆరాధన మహోత్సవము శ్రావణ శుద్ధ అష్టమి రోజు ఆగస్టు మాసములో ఆచరించబడును,
====ఇతర కార్యక్రమములు====
* వైశాఖమాసంలో వచ్చే లక్ష్మీనృసింహ జయంతి, ఆషాఢ మాసంలో గురుపౌర్ణిమ, భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి కూడా దత్తపీఠంలో విశేషంగా ఆచరించబడతాయి.
* ఇవికాక ప్రతి ఆదివారం గణపతి హోమాలు, ప్రతి పౌర్ణమికు పవమాన హోమం 16, దత్తాత్రేయ అవతార జయంతులకు దత్తాత్రేయ హోమాలు జరుగుతాయి.
 
==ఇతర మఠాలు==