నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
కొత్తగా అక్షరాస్యులైన వయోజనులు, పిల్లలతో సహా సమాజంలో అన్ని వర్గాల వారికి వినోదం, విజ్ఞానం, వికాసం కలిగించే గ్రంథాలను ప్రచురించడం నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురణల విభాగం లక్ష్యం. కథాసాహిత్యం, ఇతర సాహిత్యాలను తెలుగు, ఇంగ్లీషు, హిందీలతోపాటు 16 భాషలలో గ్రంథాలను ప్రచురిస్తున్నారు. రాజ్యాంగంలోని ఎనిమిదో అనుబంధంలో చేర్చిన భాషలన్నిటిలో పుస్తక ప్రచురణలు చేపట్టారు. ఇవేకాక ఆవో, గారో, ఖాసీ, మిసింగ్, మిజో మొదలైన ఆదివాసీ భాషలలో కూడా ప్రయోగాత్మకంగా ప్రచురణలు చేపట్టారు.<br />
ప్రాముఖ్యత కలిగివున్నా, భారతసాహిత్యంలో నిర్లక్ష్యానికి గురైన పాపులర్ సైన్స్ పుస్తకాలు, సాంకేతిక పరిభాష లేని సమాచార గ్రంథాలు, పర్యావరణ విజ్ఞాన గ్రంథాలు, దేశంలోని వివిధ విషయాలకు చెందిన పుస్తకాల ప్రచురణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వివిధ భాషల్లోని మౌలిక గ్రంథాలు, అనువాదాలు, ఉత్తమ గ్రంథాల పునర్ముదణలు కూడా చేస్తున్నారు.<br />
సాహిత్య అకాడెమీ పురస్కారాలు, జ్ఞానపీఠ్ పురస్కారాలు పొందిన ఉత్తమ గ్రంథాలను, ఇతర క్లాసిక్ పుస్తకాలను ఎంపికచేసుకుని అన్ని భాషల్లోకీ అనువాదాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుని గతంలో [[అంతర భారతీయ గ్రంథమాల]], ప్రస్తుతం [[ఆదాన్ ప్రదాన్]] పథకాలుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 32 భాషల్లో 17వేలకు పైగా పుస్తకాలు ప్రచురించారు.<ref>పుస్తకసూచి 2013 తెలుగు ప్రచురణలు: మా పరిచయం:నే.బు.ట్ర.ప్రచురణ</ref> భారతదేశానికి సంబంధించిన పలు అంశాలను సవివరంగా భారత పాఠకులకు అందించడమే లక్ష్యంగా భారతదేశం-ప్రజలు అనే శీర్షికతో పుస్తకాలు ప్రచురించారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=%E0%A4%AE%E0%A4%A8%E0%A4%AE%E0%A5%81%20%E0%A4%AE%E0%A4%A8%20%E0%A4%86%E0%A4%B9%E0%A4%B0%E0%A4%AE%E0%A5%81&author1=%E0%A4%85%E0%A4%9A%E0%A4%BE%E0%A4%AF%E0%A5%8D%E0%A4%B0%E0%A4%BE%20%E0%A4%95%E0%A5%87%20%E0%A4%9F%E0%A5%80&subject1=GENERALITIES&year=1981%20&language1=telugu&pages=124&barcode=99999990175613&author2=NULL&identifier1=NULL&publisher1=Neshanal%20Buka%20Trasta,%20Indiyaa&contributor1=NULL&vendor1=NONE&scanningcentre1=cdac,noida&slocation1=NONE&sourcelib1=NBT&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20of%20India&digitalpublicationdate1=2004-12-27&numberedpages1=0&unnumberedpages1=0&rights1=Not%20Available&copyrightowner1=NULL&copyrightexpirydate1=0000-00-00&format1=NULL%20&url=/data1/upload/0029/923 భారత డిజిటల్ లైబ్రరీలో మనము మన ఆహారము పుస్తకంలోని పీఠిక]</ref>
 
== పఠనాసక్తికి ప్రోత్సాహం ==