ఈమాట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
 
== పాలసీలు ==
ఈమాట పత్రిక రచనల స్వీకరణ, ప్రచురణల్లో సమీక్షా పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పద్ధతిలో మొదట రచనలను సంపాదకులు పరిశీలిస్తుంటారు, ఆపైన అవసరమైతే తత్సంబంధిత రంగాల్లో నిపుణులైన ఇతర విమర్శకులు ఇద్దరితో సమీక్షింపజేస్తారు. ఆ సమీక్షావివరాలు రచయితలకు అందజేసి కొద్దిస్థాయిలో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మార్పులు లేకుండానే తమ రచనలు ప్రచురణ కావాలని రచయితలు భావిస్తే ఆ రచన ఈమాట వారు తిరస్కరించడమో, రచయిత ఉపసంహరించుకోవడమో జరుగుతుంది. రచయితలతో సంప్రదింపుల ఫలితంగా ప్రచురణార్హమైన రచనలను తుదిగా నిర్ణయిస్తారు. ఈ పద్ధతిని కొందరు రచయితలు, సాహిత్యవేత్తలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానంగా రచనల్లో ఉన్నత విలువలు నెలకొల్పేందుకు ఉద్దేశించే తాము ఈ ''పీర్ రివ్యూ'' విధానం ప్రవేశపెట్టామని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన పద్ధతి అని తెలుగువారు అలవాటుపడితే సరిపోతుందని సమాధానమిస్తున్నారు. ఇతర పత్రికల్లో సంపాదకులదే నిర్ణయమంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈమాటలో మాత్రం ఈ విధమైన ప్రివ్యూ పద్ధతితో రచయితలు, సమీక్షకులు, సంపాదకులు సమిష్టి నిర్ణయంతో వ్యవహరిస్తున్నామని వ్రాశారు.<ref>{{cite journal|last1=వెంకటేశ్వరరావు|first1=వేలూరి|title=ఈమాట – నామాట|journal=ఈమాట|date=నవంబర్ 2008|volume=10|issue=నవంబర్ 2008|url=http://eemaata.com/em/issues/200811/1368.html#|accessdate=15 January 2015}}</ref>
 
==శీర్షికలు, రచనలు==
"https://te.wikipedia.org/wiki/ఈమాట" నుండి వెలికితీశారు