చిన్నదాన నీ కోసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
| share = {{INRconvert|20|c}}<ref>[http://www.ibtimes.co.in/mukunda-chinnadana-nee-kosam-first-weekend-collection-box-office-618568 'Mukunda', 'Chinnadana Nee Kosam' First Weekend Collection at Box Office] - ''IBTimes'' Dated 29 December 2014 Retrieved 29 December 2014</ref>
}}
'''చిన్నదాన నీ కోసం''' 2014 లో విడుదలైన తెలుగు సినిమా. ఇది ‘ఇష్క్’, ‘గుండెజారి గ‌ల్లంతయిందే’ సినిమాల కథానాయకుడైన [[నితిన్]] తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై రూపొందించిన చిత్రం. తాత‌య్య కోసం మ‌న‌వ‌రాలు ఫారెన్ నుంచి ఇండియా వ‌చ్చి, ఇక్క‌డో నాట‌కం ఆడి, తాత‌య్య‌ని త‌న‌తో పాటు తీసుకెళ్లిపోవ‌డం ఈ క‌థ‌.
==కథ==
నితిన్ (నితిన్‌) ప‌నీపాటా లేకుండా తిరుగుతుంటాడు. అత‌ని నాన్న (న‌రేష్‌), అమ్మ (సితార‌)ది ప్రేమ వివాహం. నితిన్‌కి ఒక అక్క‌. ఆమెకి పెళ్ల‌యి పోయి ఉంటుంది. త‌ను స‌ర‌దా ట్రిప్ వెళ్తూ ఐదేళ్ల కొడుకును త‌ల్లి ఇంట్లో వ‌దిలేస్తుంది. నితిన్‌కి ఓ చెల్లెలు కూడా ఉంటుంది. ఆనాటి సావిత్రి నుంచి నేటి దీపికా ప‌దుకొనే వ‌ర‌కు. సినిమా తార‌లు ఎలా ఉంటారో కూడా తెలియ‌ని ఇల్లాలు సితార‌. ఓ రోజు రోడ్డుమీద నితిన్ తెల్ల‌టి పరదా ఎగ‌రేసుకుని కారులో వెళ్తున్న అమ్మాయిని చూస్తాడు. తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. కానీ కొన్ని పర్సనల్ కారణాల వల్ల నందిని నితిన్ దూరం పెడుతుంది. ఆమె వెంట తిరుగుతుంటాడు. పేరు నందిని (మిస్తి) అని తెలుస్తుంది. త‌ను భ‌ర‌త‌నాట్యం, వీణ‌, ఏరోబిక్స్ త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హిస్తూ బిజీగా ఉంటుంద‌ని తెలుసుకుంటాడు. ఇన్ని క‌ళ‌లున్న ఆమె వెంట నిర్విరామంగా తిరిగి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు. ఓ రోజు నందినికి నితిన్ కి రెడ్డి బాగా దగ్గర అనే విషయం తెలుసుకొని నితిన్ ద్వారా రెడ్డి ని కలుసుకుంటుంది. అలా దగ్గరియి ఓ రోజు సడన్ గా నితిన్ కు చెప్పకుండా నందిని, రెడ్డిని తీసుకోని యూరోప్ వెళ్ళిపోతుంది. అది తెలుసుకొని నితిన్ కూడా యూరోప్ కు వెళ్ళిపోతాడు. అక్కడ నితిన్ కి నమ్మలేని ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/చిన్నదాన_నీ_కోసం" నుండి వెలికితీశారు