భాట్టం శ్రీరామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జర్నలిజం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 37:
}}
==జీవిత విశేషాలు==
ఇతడు [[విశాఖపట్టణం]] జిల్లా ధర్మవరం గ్రామంలో [[1926]], [[మే 12]]న జన్మించాడు<ref>[[http://164.100.47.132/LssNew/biodata_1_12/2988.htm]]లోక్‌సభ వెబ్‌సైటులో భాట్టం శ్రీరామమూర్తి బయోడేటా</ref>. ఇతని తండ్రి పేరు సన్నయ్య. బి.ఎ., ఎల్.ఎల్.బి వరకు చదువుకొన్నాడు. ఇతడి వివాహం సత్యవతితో జరిగింది. ఇతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.
 
==రాజకీయ ప్రస్థానం==
ఇతడు [[భారత సోషలిస్టు పార్టీ]]లో చురుకుగా పాల్గొన్నాడు. 1955లో ఆ పార్టీ రాష్ట్రశాఖకు జాయింట్ సెక్రెటరీగా, 1957లో జనరల్ సెక్రెటరీగా ఉన్నాడు. తరువాత [[కాంగ్రెస్ పార్టీ]]లో చేరాడు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో సుమారు 16 సంవత్సరాలు సభ్యుడిగా కొనసాగాడు. ఇతడు 1957 మరియు 1962లలో [[విజయనగరం శాసనసభ నియోజకవర్గం]] నుండి, 1972 మరియు 1978లలో [[పారవడ శాసనసభ నియోజకవర్గం]] నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇతడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1972లో విద్య, సాంస్కృతిక శాఖామాత్యుడిగా, 1974-78లో సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రిగా, 1981లో సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు. ఇతడు బి.సి.సంక్షేమం, హరిజన సంక్షేమం, గిరిజన సంక్షేమం, యువజన సర్వీసులు, ఆర్కియాలజీ, ఎండోమెంట్స్ శాఖలకు కూడా మంత్రిగా సేవలనందించాడు. ఇతడు 1984లో 8వ లోక్‌సభకు విజయనగరం నియోజకవర్గం నుండి [[తెలుగుదేశం పార్టీ]] పక్షాన లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.