కండర సంకోచము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
కండరమునకున్న అతి ముఖ్యమైన సామర్ధ్య్తత సంకోచ మరియు వ్యాకోచ క్రియలను జరుపుట. ఈ ప్రక్రియ నాడీ మండలము యొక్క ఆధీనములో ఉండును. మోటారునాడి ద్వారా జరుగు ప్రక్రితి లేక్క కృత్రిమ ప్రేరణకు గురియైనపుడు దాని కనుగుణముగ సంకోచించును. నాడీకణము యొక్క అక్షీయ తంతువు (Axon) కండరము లోనికి పోయి అంతమగును. దీనిని మోటారు నాడీకణమని అందురు.ఈ కణము యొక్క సైటాన్ మెదడునందు గాని, వెన్నుపామునందుగాని డండును.మోటారు అంత్యఫలకము మరియు నాడీ అంత్య భాగముల క్రియాత్మక కలయిక ప్రదేశమును న్యూరోమస్కులార్ కూడలి (Neuromuscular junction) అందురు.
 
కండరము విశ్రాంతి దశలో ఉన్నప్పుడు కండరపు పోగుయొక్క వెలుపలి త్వచము విద్యుత్ ధ్రువితమవుతుం ది అనగా దానివెలుపలి త్వచము ధనావేసము(Positively charged) అవుతుంది .కండరపు పోగుయొక్క లోపలి త్వచము వ్యతిరేక విద్యుదావేశాలతో లేదా క్షమలతో ఉంటుంది. అందు వలన లోపలి వెలుపలి తలాల మధ్య శక్మాంతరము(Potential difference) అమరి ఉంటుంది. దీనిని విరామశక్మం (Resting potential) అంటారు. ధనావెశము అయిన పొర నాడిప్రచోదనాలను గ్రహిస్తూంది. ఈ నాడీ ప్రచోదనాలు నాడీ అంత్యఫలకము దగ్గరకు చేరగానే ఎసిటైల్ కోలిన్ కండర ఉపరితలము మీద విడుదల అవుతుంది.
 
===సిద్దాంతాలు (Theories)===
"https://te.wikipedia.org/wiki/కండర_సంకోచము" నుండి వెలికితీశారు