సేంద్రీయ వ్యవసాయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) అనగా ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం. సేంద్రీయ వ్యవసాయము రెండు పద్ధతులు కలదు.
 
మొదటి పద్ధతిలో కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, అనగా ఎండిన ఆవు/గేదె పేడ, ఆకు తుక్కు, వర్మీ కంపోస్టు (వానపాముల విసర్జన), వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం జరుగుతుంది. ఇది సాధారణ పద్ధతి. ఈ పద్ధతి కేరళ మరియూ ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం ముందు స్థానంలో కలదు.
 
రెండవ పద్ధతిని గో-ఆధారిత పద్దతి లేదా సుభాష్ పాలేకర్ పద్ధతి అని అందురు. ఈ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం జీవామృతం అను సహజ రసాయనంతో సాగుతుంది. ఇక కీటక నాశానులుగా నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం అను సహజ రసాయనాలు వాడబడతాయి.
 
సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం ముందు స్థానంలో కలదు.
 
==చరిత్ర==
 
సుమారు 1970వ శకం నుండీ రసాయన పురుగుల మందుల ధరలు వందల రెట్లు పెరిగాయి. వీటితో రైతుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కాని వ్యవసాయం వల్ల వచ్చే రాబడి మాత్రం పెరగలేదు. వచ్చిన కొద్దిపాటి ఆదాయం కాస్తా పురుగుల మందులకు - కృత్రిమ ఎరువులకు ఖర్చు అయిపోతున్నది. రైతులు తమ పొలం పనులకు ట్రాక్టరు లేక ఎద్దులు, బండి కొనాలన్నా బ్యాంకులనుండి అప్పులు తీసుకోవలసివస్తున్నది. ఆశించినమేరకు చేతికి పంట రాకపోవుటవలన, అప్పులు తీర్చలేక రైతులు ఆత్మ హత్యలు చేసుకొనే పరిస్తితి ఏర్పడింది. రైతులు తమ పిల్లలను వ్యవసాయం వైపు మళ్ళకుండా చదువులు చెప్పించి ఉద్యోగాలవైపు, వ్యాపారాల వైపు మళ్ళేలా చేయడం జరుగుచున్నది.
 
పురుగుల మందులు, రసాయన ఎరువులు వాడి పండిస్తున్న పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి, ఎన్నో మిత్ర పురుగులు, పక్షులు అంతరించిపోయాయి, భూమి సహజమైన సారాన్ని కోల్పోయి మందులు వాడితేగాని పంటలు పండని స్తితిలోకి వెళ్ళి నిస్సారమైపోయింది. ఈ భయంకరమైన కారణాలే రైతులు తిరిగి పూర్వపు సేంద్రీయ వ్యసాయంవైపు వెళ్ళేలా చేశాయి.
 
'''(వ్యాసము విస్తరణలో ఉన్నది. ఎవరైనా ఈ వ్యాస విస్తరణకు సహకరించవచ్చు)'''
 
 
 
==నేటి పరిస్థితి, భవిష్యత్తు==
 
'ఉద్యోగంతో రోజులు గడుపుకోవడమే గాని సంపాదన ఉండదు, ఆస్తులు సంపాదించలేము, చదువుకి - సంపాదనకి సంబంధం లేదు, చదువు లేనివారు కూడా కోట్లు సంపాదిస్తున్నారు, సంపాదనకి కావాల్సింది తెలివితేటలే గాని చదువు కాదు, నగరాల్లో ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదని, వాహనాలు మరియూ ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం వల్ల ఆరోగ్యం ఉండదని తెలుసుకొని ఇటీవల చాలా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం తమ ఉద్యోగాలకు రాజినామా చేసి పట్టుదలతో సేంద్రీయ వ్యవసాయంలోకి అడుగు పెడుతున్నారు. నగరాలకు చేరువలో లేదా స్వగ్రామాల్లో భూములను కొని లేదా కవులకు (లీజుకు) తీసుకొని సేంద్రీయ కూరగాయల పంటలు పండిస్తూ నగరాల్లోకి ఎగుమతి చేస్తూ అదిక లాభాలు పొందుతున్నారు.
 
వ్యవసాయం చేస్తే అమ్మాయిని ఇవ్వం అని అలోచించే ఆడపిల్ల తల్లిదండ్రులు, పట్నంలో చిన్నా చితకా ఉద్యోగమైనా పర్వాలేదు, వ్యవసాయం వద్దని వారించే అబ్బాయిల తల్లిదండ్రులు, తమ ఆలోచనలను మార్చుకునే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మా అబ్బాయి రైతు, మా అబ్బాయి భూమి పుత్రిక అని ప్రతి తల్లితండ్రీ గర్వంగా చెప్పుకొనే సమయాలు మునుముందు రానున్నాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/సేంద్రీయ_వ్యవసాయం" నుండి వెలికితీశారు