తూమాటి దోణప్ప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
==ఉద్యోగము==
1957లో "తెలుగు వ్యుత్పత్తి పదకోశం" నిర్మాణ ప్రాజెక్టులో ముఖ్యసహాయకుడిగా చేరి 1961 వరకు పనిచేశాడు. 1958లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడిగా చేరాడు.1970లో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు. 1976లో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖకు ప్రధానాచార్యుడయ్యాడు. 1970-76లో "తెలుగు వ్యుత్పత్తి పదకోశం" ప్రాజెక్టు ముఖ్యసంపాదకుడిగా ఉన్నాడు. 1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిష్ట్రారుగా, 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాలాధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా, అంతర్జాతీయ తెలుగు సంస్థ డైరెక్టరుగా నియుక్తుడయ్యాడు. 1986లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియమించబడ్డాడు.
==నాటకాలు==
తూమాటి దోణప్ప విద్యార్థిదశలో నాటకాలలో నటించి రాణించాడు. చింతామణి నాటకంలో 'చిత్ర'పాత్రధారిగా, 'సుభద్రా పరిణయం'లో సుభద్ర పాత్రను, 'మోహినీరుక్మాంగద'లో రుక్మాంగద పాత్రను ధరించి అనేక పతకాలను పొందాడు. [[పుట్టపర్తి]] [[సత్యసాయిబాబా]] పూర్వాశ్రమంలో రత్నాకరం సత్యనారాయణరాజు స్త్రీ పాత్రలు ధరించగా అతనితో కలిసి ఇతడు భర్తగా, మామగా అనేక నాటకాలలో పాత్రధారణ చేశాడు. సాయిలీల అనే నాటకంలో దోణప్ప ఒకసారి సాయిబాబాగా, ఒకసారి శిష్యుడిగా, మరోసారి మహావిష్ణువుగా నటించాడు.
==రచనలు==
 
ప్రభుత్వము నుండి ఉత్తమ ఆంధ్ర భాషాచార్యులు గా ప్రశంసా పత్రము, గౌరవాన్ని పొందిన దోణప్ప "ఆంధ్రుల అసలు కథ", "బాలల శబ్ద రత్నాకరం", "తెలుగు మాండలిక శబ్దకోశం", "భాషా చారిత్రక వ్యాసావళి", "ఆంధ్ర సంస్థానములు-సాహిత్యసేవ", "తెలుగులో కొత్త వెలుగులు", "జానపద కళా సంపద", "తెలుగు హరికథా సర్వస్వం", "తెలుగులో చేరిన ఇండో-ఆర్యన్ పదాలు", "దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట", "మన కళాప్రపూర్ణుల కవితారేఖలు", "ఆకాశవాణి భాషితాలు","తెలుగు వ్యాకరణ వ్యాసాలు" మున్నగు పలు రచనలు చేశాడు.
"https://te.wikipedia.org/wiki/తూమాటి_దోణప్ప" నుండి వెలికితీశారు