రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఆయుర్వేద చిట్కాలు==
*రోజూ ఉదయాన్నే నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగండి. తులసిమొక్కకు రోగనిరోధకశక్తిని పెంచే గుణంతోపాటు.. ఇందులోని ఔషధగుణాలు గొంతును, ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతాయి.
*తిప్పతీగ.. ఇది చాలా ప్రాంతాల్లో విరివిగా దొరుకుతుంది. దొరికితే ఒక అడుగు పొడుగున్న తిప్పతీగను తీసుకుని (లేదా ఆయుర్వేద మూలికలు అమ్మే దుకాణాల్లో తిప్పతీగ పొడి దొరికే అవకాశం ఉంది. దాన్నైనా వాడుకోవచ్చు), దాంతోపాటు ఐదారు తులసి ఆకులను నీళ్లల్లో వేసి 20 నిమిషాల పాటు మరిగించండి. రుచికోసం ఆ కషాయానికి తగుమోతాదులో నల్లమిరియాలు, సైంధవలవణం, రాతి ఉప్పు, పటిక బెల్లం వంటివి కలుపుకొని ఆ మిశ్రమాన్ని గోరువెచ్చగా తాగండి. రోగ నిరోధక వ్యవస్థను అద్భుతంగా పనిచేయించే శక్తి ఈ కషాయానికి ఉంది.
*పచ్చివెల్లుల్లిని తినగలిగినవారు రోజూ ఉదయాన్నే రెండు రెబ్బల్ని గోరువెచ్చటి నీటితో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*గోరువెచ్చటి పాలల్లో పసుపు కలుపుకొని తాగితే చాలా మంచిది.
*[[కలబంద]] ఆకుల నుంచి తీసిన రసాన్ని ఒక టీస్పూన్‌ మేర నీళ్లతో కలిపి తీసుకుంటే చర్మానికి మంచిది. కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటన్నిటితో పాటు.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*నిమ్మజాతికి చెందిన పండ్లను.. సి విటమిన్‌ అధికంగా ఉండే పండ్లరసాలను అధికంగా తీసుకుంటే మంచిది.
*నిత్యవ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రాణాయామం, యోగా వంటివి కూడా.. నోరు, గొంతు, ఊపిరితిత్తులపై దాడి చేసే వ్యాధులను నిరోధించే శక్తిని శరీరానికి ప్రసాదిస్తాయి.
 
== అసంక్రామ్యత రకాలు ==
'''అసంక్రామ్యత''' రెండు రకాలు:
"https://te.wikipedia.org/wiki/రోగ_నిరోధక_వ్యవస్థ" నుండి వెలికితీశారు